తమన్-తేజు.. 148 కొడతారట

Update: 2017-02-20 04:42 GMT
తిక్క.. సాయిధరమ్ తేజ్ వరుస హిట్లతో ఊపుమీదున్న టైంలో అతడికి పెద్ద బ్రేకేసిన సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. తొలిసారి సాయిధరమ్ తో పని చేసింది ఈ సినిమాకే. ఐతే ముందు ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్సే వచ్చింది కానీ.. సినిమా అట్టర్ ఫ్లాపవడంతో పాటలు కూడా కనుమరుగైపోయాయి. ఇప్పుడు సాయిధరమ్-తమన్ కాంబోలో ‘విన్నర్’ వస్తోంది. ఈ సినిమా పాటలు ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. సినిమా కూడా బాగా ఆడుతుందని అంటున్నాడు తమన్. తేజుతో తన కాంబినేషన్ ను టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోని ఆటతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తమన్.

‘‘నేను.. తేజు కలిసి క్రికెట్ ఆడుతుంటాం. కాబట్టి క్రికెట్ పోలిక చెబుతా. మా ఇద్దరి తొలి సినిమా ‘తిక్క’ నిరాశ పరిచింది. ధోని తొలి మ్యాచ్ లో డకౌటైనా.. తర్వాత పాకిస్థాన్ మీద 148 కొట్టాడు. మా ఇద్దరి కాంబినేషన్ కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నా. ‘విన్నర్’తో సూపర్ హిట్ కొడతాం. రీరికార్డింగ్ టైంలో సినిమా చూశా. చాలా బాగుంది. పెద్ద హిట్టవుతుందని అనిపించింది. గోపీచంద్ మలినేని నాకు బ్రదర్ లాంటి వాడు. నేను స్ట్రగుల్లో ఉన్నపుడు ‘బలుపు’ ఇచ్చాడు. వరుసగా నాతోనే సినిమాలు చేస్తున్నాడు. నల్లమలుపు శ్రీనివాస్ గారు నన్ను ‘చింతకాయల రవి’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం చేయాలని చాలా ప్రయత్నించారు. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. ఇప్పుడు ఆయన బేనర్లో విన్నర్ లాంటి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని తమన్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News