అవాక్క‌య్యేలా వెకిలి ఫ్యాన్ పై థ‌మ‌న్ విసిరిన పంచ్

Update: 2021-04-12 04:30 GMT
వ‌కీల్ సాబ్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ ని ఎంజాయ్ చేస్తున్న థ‌మ‌న్ కి ఓ నెటిజ‌న్ రూపంలో వెకిలి ప్ర‌శ్న ఎదురైంది. దానికి థ‌మ‌న్ విసిరిన పంచ్ అంతే అదిరింది. అస‌లింత‌కీ ఆ నెటిజ‌న్ తో థ‌మ‌న్ సంభాష‌ణ ఎలా ఉంది? అన్న‌ది చూస్తే అవాక్క‌వుతారు.

వకీల్ సాబ్ ని ప్ర‌శంసిస్తూ సూప‌ర్ స్టార్ మహేష్ ట్వీట్ చేసిన తరువాత తమన్ అదే విష‌యాన్ని కోట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అయితే దానికి ఓ నెటిజ‌న్ స్పందించాడు. `సర్కార్ వారి పాట` హ్యాష్ ట్యాగ్ గురించి ప్రస్తావించలేదని గుర్తుచేస్తూ స‌ద‌రు నెటిజన్ థ‌మన్ పై వ్యంగ్యంగా స్పందించాడు. అతను తమన్ ‌ను ఏమ‌ని అడిగాడంటే.. ``సర్కారు వారి పాట‌ని ట్యాగ్ చెస్తే అమ్మ అన్నం పెట్టనన్నదా బ్రో (మా హీరో సినిమాని ట్యాగ్ చేయొచ్చు క‌దా అనేది అభిమాని ఉద్ధేశం)?`` అని ప్ర‌శ్నించాడు.

నిజానికి అభిమాని వినిపించిన‌ లైన్ వెన‌క చాలా క‌థే ఉంది. ఇంత‌కుముందు అల వైకుంఠ‌పుర‌ములో ప్ర‌చార ఇంట‌ర్వ్యూలో థ‌మ‌న్ అన్న మాట‌నే అభిమాని కోట్ చేశాడు.

``నేను ట్యూన్లను ఎందుకు కాపీ చేస్తాను? నేను కాపీ చేసిన ట్యూన్ లను కంపోజ్ చేసి ఇంటికి తిరిగి వెళితే నా తల్లి నాకు అన్నం పెడుతుందా?`` అని చాలా స‌ర్కాస్టిక్ గా అన్నారు థ‌మ‌న్. అయితే థ‌మ‌న్ అలా అన‌గానే... చాలామంది నెటిజ‌నులు అంతే వ్యంగ్యంగా స్పందించారు.  ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు కూడా నెటిజన్ తమన్ ను అదే అడిగాడు. తమన్ అతనికి ఒక కౌంటర్ ఇచ్చాడు కానీ అది ఎంతో మర్యాద‌పూర్వ‌కంగా ఉంది. పైగా గ‌ట్టి పంచ్ లా గుండెల్ని తాకింది.

ఇంత‌కీ థ‌మ‌న్ ఏమ‌న్నారంటే.. ``మా అమ్మ గారు అన్నం పెట్ట‌డం ప‌క్క‌న పెడితే నేను మా అమ్మ‌గారికి గ‌త 27 ఏళ్లుగా అన్నం పెట్టి జాగ్ర‌త్త‌గా కంటికి రెప్ప‌లాగా చూసుకుంటున్నా.. కాబట్టి ముందు మీ అమ్మ‌గారికి చెప్పు నీకు మంచి బుర్ర పెరిగే కూర‌గాయ‌ల‌తో వంట చేసి పెట్ట‌మ‌ని..#DOT అంటూ కౌంట‌ర్ వేశారు. ఎంతో మ‌ర్యాద‌పూర్వ‌కంగా విసిరిన పంచ్ అభిమానికి అంతే గ‌ట్టిగా త‌గిలింది.

తమన్ తండ్రి 27 సంవత్సరాల క్రితం కన్నుమూశారు. అతని తల్లి కుటుంబాన్ని నడపడానికి చాలా కష్టపడ్డారు. సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన థ‌మ‌న్ ఇంతింతై ఈ స్థాయికి ఎదిగారు. ఇన్నేళ్లు త‌న త‌ల్లిని త‌నే పోషించారు. ఇప్పుడు అభిమాని కూడా అలా స్ఫూర్తివంత‌మైన జీవితం గ‌డ‌పాల‌న్న‌ది థ‌మ‌న్ తాత్ప‌ర్యం. మ‌ర్యాద‌పూర్వ‌క పంచ్ తో థ‌మ‌న్ బ్రో గ‌ట్టిగానే కొట్టారు.
Tags:    

Similar News