బాక్స్ ఆఫీస్ దగ్గర వారానికి ఒక సినిమా. సినిమా కి ఒక హీరోయిన్. ఇలా ఎంతో మంది కొత్త హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నా - సీనియర్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తూ తన స్టార్ స్టేటస్ ని కాపాడుకుంటూ వస్తున్న కొంతమంది హీరోయిన్స్ లో తమన్నా ఉంటుంది. హ్యాపీ డేస్ తో స్టార్ గా మారిన ఈ మిల్కీ బ్యూటీ 2017 మొత్తం వరుస సినిమాలు షూటింగ్స్ తో గడిపేసింది.
నేను చేసే పాత్రలని నేను ఎంజాయ్ చేయగలగాలి అంటున్న ఈ చిన్నది ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరో గా నటిస్తున్న నా నువ్వే సినిమా లో నటిస్తోంది. బాలీవుడ్ హిట్ సినిమా క్వీన్ కు రీమేక్ గా వస్తున్న తెలుగు వెర్షన్ లో కూడా ఈ భామే ముఖ్య పాత్ర పోషిస్తుంది. తరువాత సినిమాల గురించి అడుగగా తమిళ్ లో శీను రామస్వామి దర్శకత్వంలో మరొక సినిమా కూడా చేయబోతున్న విషయం తెలిపింది. రెసెంట్ గా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కెచ్ సినిమాలో విక్రమ్ తో నటించిన తమన్నా "2018 నాకు చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ సంవత్సరం లో నా ఫ్యామిలి తో ఎక్కువగా గపడబోతున్నందుకు ఆనందంగా ఉంది. నేను చేసిన సినిమాల గురించి ఆలోచించడానికి బోలెడంత టైం దొరికింది. కానీ నేను రిజల్ట్స్ గురించి పెద్దగా పట్టించుకోను." అంటోంది.
సినిమా రిజల్ట్స్ గురించి అక్కర్లేదు అని హీరోయినే అనేస్తే మరి ప్లాప్ అయితే ఎవరు నష్టపోయేది? కేవలం నిర్మాత మాత్రమేనా? చేయాల్సింది చేసాం రెమ్యూనరేషన్ తీసుకున్నాం కదా అని చేతులు దులిపేసుకుంటే ఎలా అమ్మా తమన్నా? అయినా రిజల్ట్ తో సంబంధం లేదని సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరన్నా చెప్పినా ఒక అర్థం ఉంది. స్వయంగా హీరోయిన్ అయ్యుండి నేను సినిమా హిట్ అయిన ప్లాప్ అయినా పట్టించుకొను అంటే ఎంత వరకు సమంజసం అంటారు?