తెలుగు సినిమాని తిట్టడం ఫ్యాషనా??

Update: 2015-08-15 04:18 GMT
ఓ ఎన్నారై యువతి తెలుగు సినిమాలను నానా తిట్లు తిట్టేసిన వీడియో కి ఇంకా రియక్షన్స్ వస్తూనే ఉన్నాయి. మూవీల్లో ఉండే సీన్లను ఏకేయడం, కొంతమందిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదంటూ.. ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.  తెలుగోళ్లకి తెలుగు సినిమాని తిట్టడం ఫ్యాషన్ అయిపోయిందని విరుచుకుపడ్డారు.

ప్రతీ అంశానికీ మంచీ చెడూ రెండూ ఉంటాయని, సినిమాలు కూడా అంతేనని... మంచిని వదిలేసి, చెడును పట్టుకు వేళ్లాడ్డం అంటే... కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే అన్నారు తమ్మారెడ్డి. బాహుబలి లాంటి కళాఖండంలో కొన్ని సీన్స్ వాళ్లకు  నచ్చనంత మాత్రాన... తిట్టడం సరికాదని క్లాస్ పీకారు. తెలుగులో  మంచి సినిమాలు చాలా వస్తున్నాయని, కానీ వాటిని వీళ్లెవరూ చూడకుండా... చూసినవాటిలోనే తప్పులు వెతుక్కుంటున్నారని మండిపడ్డారు. సినిమాని సినిమాగా చూడకుండా... ఇచ్చిన డబ్బులకు న్యాయం జరిగిందా లేదా అని ఆలోచించింనంత కాలం ఇలాంటి భావజాలమే జనాలకు ఉంటుందని వివరించారాయన.

సినిమాల్లో మెసేజ్ లు ఇచ్చేవి కూడా ఉంటాయని.. ఉదాహరణకు శ్రీమంతుడు చూశాక సైకిల్స్ తొక్కడం ట్రెండ్ అయిందని నెట్ లో చదివానని చెప్పారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా.. కేవలం చెడు అంశాలనే తీసుకుంటున్నారని అన్నారు. మాట్లాడే హక్కు అందరికీ ఉందనీ, కాని వ్యక్తిగతంగా తిట్టడం సరికాదన్నారు తమ్మారెడ్డి. శ్రీమంతుడులో మహేష్ సైకిల్ తొక్కిన తర్వాత... తెలుగురాష్ట్రాల్లో సైకిల్స్ కి డిమాండ్ పెరిగిందని... జనాలకు తెలియచేసింది తుపాకీ సైట్ లోనే. గుర్తుందా?
Tags:    

Similar News