మిగిలిన ‘వుడ్డు’ల్ని పక్కన పెడితే.. టాలీవుడ్ వరకూ పెద్దమనిషి తరహాలో వ్యవహరించే సినీ ప్రముఖుల జాబితా తీస్తే.. అందులో తప్పనిసరిగా ఉండే పేర్లలో తమ్మారెడ్డి భరద్వాజ పేరు ఒకటి. విషయం ఏదైనా కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడే తత్వ్తం ఆయనలో ఎక్కువే. ఎవరేం అనుకుంటారన్నవిషయాన్నిపక్కన పెట్టి.. తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేస్తుంటారు.
మారిన కాలానికి తగ్గట్లు తనను మార్చుకున్న ఆయన.. వీడియోల రూపంలో పలు అంశాల మీద స్పందిస్తున్నారు. ‘‘నా ఇష్టం’’ సిరీస్ లో ఆయన పలు అంశాల మీదమాట్లాడుతున్నారు. తాజాగా అటు కోలీవుడ్ ను.. ఇటు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన సుచిలీక్స్ అంశంపై ఆయన మాట్లాడారు. ప్రతి విషయం మీదా మాట్లాడే అలవాటున్న సినీప్రముఖులు సైతం సుచి లీక్స్ గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు
ఇలాంటివేళ.. తమ్మారెడ్డి భరద్వాజ ఈఅంశంపై పెదవి విప్పారు. ఆయన ఏమన్నారో చూస్తే.. ‘‘సినిమా వాళ్లంటే మంచి అభిప్రాయం ఉంది (వ్యంగ్యంగా). సుచి లింక్స్ తో ఇంకాస్తమంచి అభిప్రాయం వచ్చేసింది(మరింత వ్యంగ్యంగా). సుచి లీక్స్ పేరుతో వస్తున్న ఫోటోల్ని.. వీడియోల్నితెగ చూసేస్తున్నారు. ఇంకేం వస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. సమస్య ఏమిటంటే.. అవి నిజమా?లేదా? అన్నది తేల్చాలి. ఒకవేళ ఇవి నిజమతే.. ఈ వీడియోలు తీస్తున్న వాళ్లు ఎవరు? ఇంత శాడిస్టిక్ ఆలోచనలు ఎవరికి ఉన్నాయన్నది తేల్చాలి. అసలు వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు?’’ అంటూ ప్రశ్నించారు.
ఒకవేళ అవి అబద్ధమైతే.. అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేస్తున్న వాళ్లపై ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదన్నది మరో సందేహాన్ని వ్యక్తం చేశారు. ‘‘ప్రతి దానికి ఎవరో కంప్లైంట్ చేస్తేనే విచారణ చేయటం ఎందుకు? ఈ ఉదంతం బయటకు వచ్చి దాదాపు పది రోజులు అవుతోంది.ఇంత కాలం ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఎంత సేపటికి తర్వాతి లింక్ ఏమిటన్నది చూస్తున్నారే కానీ.. వెనువెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఎంకరజ్ చేస్తూ పోతే.. ఇలాంటి ఇంకా ఇంకావస్తూనే ఉంటాయి. వీటిల్లో ఎన్నినిజమో.. ఎన్నిఅబద్ధమో తెలీదు’’అని అన్నారు. అన్ పాపులర్ చేయటానికి.. బ్లాక్ మొయిల్ చేయటానికి ఇలాంటి చేస్తుంటారని.. వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇదంతా తన అభిప్రాయమని చెప్పుకున్నారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/