నెట్ ఫ్లిక్స్ ఇలా షాకులిస్తోందేంటీ?

Update: 2023-01-17 03:30 GMT
ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ మునుపెన్న‌డూ లేనంగా ద‌క్షిణాది సినిమాల‌పై క‌న్నేసింది. గ‌తంలో దక్షిణాది సినిమాల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌ని నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది మాత్రం సౌత్ కంటెంట్ కు పెద్ద పీట వేయ‌డం మొద‌లు పెట్టింది. టాలీవుడ్‌, కోలీవుడ్ కు సంబంధించిన ప‌లు క్రేజీ సినిమాల ఓటీటీ హ‌క్కుల్ని రికార్డు ప్రైజ్‌కి ద‌క్కించుకుంటూ షాకులమీద షాకులిస్తోంది. టాలీవుడ్ లో చిన్న సినిమా బుట్ట‌బొమ్మ నుంచి క్రేజీ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించ‌నున్న SSMB28 వ‌ర‌కు అన్ని సినిమాల ఓటీటీ హ‌క్కుల్ని ద‌క్కించుకుని షాకిచ్చింది.

ఇదే పంథాని కోలీవుడ్ సినిమాల విష‌యంలోనూ పాటిస్తూ నిర్మాణం పూర్త‌యిన, నిర్మాణంలో వున్న ప‌లు క్రేజీ త‌మిళ సినిమాల ఓటీటీ హ‌క్కుల్ని సొంతం చేసుకుంటూ `నెట్ ఫ్లిక్స్ పండ‌గ‌` అనే హ్యాష్ ట్యాగ్ తో నెట్టింట పోస్ట‌ర్ ల‌ని రిలీజ్ చేస్తూ హంగామా సృష్టిస్తోంది. తాజాగా చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా పా. రంజిత్ తెర‌కెక్కిస్తున్న పీరియాడిక్ పాన్ ఇండియా మూవీ `తంగ‌లాన్‌` ఓటీటీ హ‌క్కుల్ని ద‌క్కించుకుంది.

స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. (కేజీఎఫ్) కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో స్వాతంత్య్రానికి పూర్వం 1800 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఓ యాద‌ర్ధ గాధ నేప‌థ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మాళ‌వికా మోహ‌న‌న్‌, మ‌ల‌యాళ న‌టి పార్వ‌తీ తిరువొత్తు హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇటీవ‌లే ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్ ని చిత్ర బృందం విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో విభిన్న‌మైన వేష‌ధార‌ణ‌తో స‌రికొత్త పాత్ర‌లో విక్ర‌మ్ క‌నిపించ‌బోతున్నాడు.

ఇప్ప‌టికే టైటిల్ గ్లిమ్స్‌, టీజ‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో భారీ క్రేజ్ ఏర్ప‌డింది. `కేజీఎఫ్‌` సిరీస్ సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం పట్ట‌డంతో అదే నేప‌థ్యంలో రూపొందుతున్న `తంగ‌లాన్‌` పై కూడా అదే స్థాయి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మానంలో వున్న ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల్ని భారీ మొత్తానికి నెట్ ఫ్లిక్స్ ద‌క్కించుకోవ‌డం విశేషంగా చెబుతున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం ద‌ళితుల‌పై జ‌రిగిన మార‌ణ కాండ నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News