యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య - డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ''థాంక్యూ''. ఇందులో చైతూ సరసన బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ - హర్షిత్ రెడ్డి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. కరోనా వైరస్ ప్రభావం వల్ల కాస్త లేట్ అయిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తైనట్లు లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన పీసీ శ్రీరామ్.. ఆయన చిరు నవ్వే మొత్తం చెబుతుంది అని పేర్కొన్నారు. ''థాంక్యూ'' చిత్రానికి బీవీఎస్ రవి స్టోరీ అందించడంతో పాటు డైలాగ్స్ అందించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీకి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'మనం' వంటి క్లాసిక్ మూవీ తర్వాత నాగచైతన్య - విక్రమ్ కుమార్ కలయికలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చైతూ మూడు వెరీయేషన్స్ చూపించబోతున్నారని తెలుస్తోంది.
'థాంక్యూ' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తైన తర్వాత చైతన్య - డైరెక్టర్ విక్రమ్ మళ్ళీ ఓ కక్రేజీ ప్రాజెక్ట్ కోసం కలవబోతున్నారు. అయితే ఇది సినిమా కాదు.. ఓటీటీ కోసం రూపొందే ఓ వెబ్ సిరీస్. విక్రమ్ కె కుమార్ - నాగచైతన్య కాంబోలో ఓ హారర్ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఇందులో చైతూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుండటం విశేషం. విక్రమ్ చెప్పిన స్క్రిప్ట్ అద్భుతంగా ఉండటంతో నెగిటివ్ రోల్ అయినా చేయడానికి రెడీ అయినట్లు చై తెలిపారు. ఇది అక్కినేని హీరోకి డిజిటల్ డెబ్యూ. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్ ని నిర్మించనుంది. డిసెంబర్ లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇకపోతే అక్కినేని అందగాడు నాగచైతన్య ఇటీవల 'లవ్ స్టోరి' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపిరి పోసిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అలానే చైతూ బాలీవుడ్ డెబ్యూ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేశారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తో కలిసి చై 'లాల్ సింగ్ చద్దా' మూవీలో నటించాడు. ఇదే క్రమంలో తన తండ్రి కింగ్ అక్కినేని నాగార్జున తో కలసి 'బంగార్రాజు' సినిమా చేస్తున్నాడు చై. అంటే వచ్చే ఏడాది చైతన్య నుంచి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయన్నమాట. వీటి కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.