బాలీవుడ్ బ్లాక్ బస్టర్ క్వీన్ ను దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మొదట నీలకంఠ హ్యాండిల్ చేసిన ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ చేతిలోకి వచ్చింది. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లోనే మైసూర్ లో షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్రానికి టైటిల్ కన్ఫాం చేసినట్లు తెలుస్తోంది.
మొదట క్వీన్ వన్స్ ఎగైన్ అనే టైటిల్ వినిపించగా.. ఇప్పుడు క్వీన్ తెలుగు వెర్షన్ కు 'దట్ ఈజ్ మహాలక్ష్మి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారుట. ఇది 100పర్సెంట్ లవ్ చిత్రంలో తమన్నాను ఉద్దేశించి విరివిగా ఉపయోగించిన డైలాగ్. ఇదే లైన్ పై ఓ మంచి సాంగ్ కూడా ఉంటుంది. సో.. ఇలాంటి టైటిల్ ను క్వీన్ లాంటి స్టోరీకి ఎంచుకోవడం బాగానే ఉంటుంది. సినిమాలో హీరోయిన్ పేరు మహాలక్ష్మి అని సెట్ చేసి.. ఈ టైటిల్ ను బాగానే వాడుకోవచ్చు. కానీ వచ్చే సమస్య అంతా అనసూయతోనే. ఇప్పటికే అనసూయ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతోంది. దట్ ఈజ్ మహాలక్ష్మి అనే టైటిల్ ను వాళ్లు చూచాయగా చెప్పేశారు కూడా.
షూటింగ్ కూడా చకచకా జరుగుతున్న సమయంలో.. ఇప్పుడు క్వీన్ రీమేక్ కు ఈ టైటిల్ ను త్యాగం చేయడం ఎంతవరకూ సాధ్యం అన్నదే ఆలోచించాల్సిన విషయం. అనసూయ అండ్ టీం ఇప్పటికే రిజిస్టర్ చేసేసుకుని ఉంటే మాత్రం.. క్వీన్ మేకర్స్ వాళ్లతో అగ్రిమెంట్ చేసుకోవడమో.. కొత్త టైటిల్ వెతుక్కోడమో చేయాలి.