`రాక్షసుడు` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సరైన బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. `అల్లుడు అదుర్స్` లాంటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం(జనవరి15) సినిమా థియేటర్లలోకి రిలీజవుతోంది. ఈ సందర్భంగా మీడియా చిట్ చాట్ లో మూవీ గురించి కెరీర్ గురించి ఆసక్తికర సంగతుల్ని ముచ్చటించాడు.
*రాక్షసుడు తరువాత ఒక ప్రత్యేకమైన పాయింట్ తో కమర్షియల్ ఫిల్మ్ చేయాలనుకున్నాను.. ఇందులో నటించేందుకు పూర్తి స్థాయి అవకాశం దక్కింది. సంతోష్ నాకు 45 నిమిషాల కథను వివరించగా.. వెంటనే నచ్చింది. ద్వితీయార్థంలో కీలక ట్విస్ట్ బాగా నచ్చింది. పిల్లలకు నచ్చే అంశాలున్నాయి.
*స్క్రిప్ట్ దశ నుండి మేకింగ్ వరకు దాదాపు రెండు సంవత్సరాలు సంతోష్ శ్రీనివాష్ టైమ్ స్పెండ్ చేశారు. లాక్ డౌన్ లోనూ దీనిపై పని చేశాం. సంతోష్ నిజంగా సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మహమ్మారికి ముందు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నప్పటికీ అతను డైలాగ్ లను తిరిగి రీరైట్ చేశాడు. డైలాగుల లెంగ్త్ ని ట్రిమ్ చేశాడు. లాక్ డౌన్ వ్యవధిని ఉపయోగించుకుని అతను స్క్రిప్ట్ ను మెరుగుపరిచాడు.
*డ్యాన్సుల పరంగానూ ది బెస్ట్ గా ఉంటుంది ఈ సినిమా. నేను డ్యాన్స్ లను పూర్తిగా ఆస్వాధిస్తాను. రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో డ్యాన్సులు చేసే ఛాన్స్ నాకు లభించింది. సెట్స్ లో నాకు అదనపు జోష్ దక్కింది. మొదటిసారి నేను రిహార్సల్ చేయలేదు. ఈ చిత్రంలో నా డ్యాన్సులను ఖచ్చితంగా ఇష్టపడతారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చాలా ట్యూన్లు ఎగ్జయిట్ చేస్తాయి. నభానటేష్.. అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా చక్కని పాత్రల్లో పోటీపడుతూ నటించారు.
ఈ సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకుంటానన్న ధీమా ఉంది... అంటూ ఇంటర్వ్యూ ముగించారు.