సినిమా రంగంలో ప్రేమ వ్యవహారాలు మరియు బ్రేకప్ లు చాలా కామన్ గా చూస్తూనే ఉంటాం. కొందరు ప్రేమను పెళ్లి వరకు తీసుకు వెళ్లిన దాఖలాలు కూడా ఉన్నాయి. పెళ్లి వరకు వెళ్లిన కొందరిలో బ్రేకప్ అయిన వారు కూడా ఉన్నారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా సోషల్ మీడియాలో సెలబ్రెటీ హోదా దక్కించుకున్న వారిలో కూడా ఇలాంటి లవ్ స్టోరీలు మరియు బ్రేకప్ స్టోరీలు చాలా ఉంటున్నాయి.
బుల్లి తెరకు చెందిన స్టార్స్ ఈ లవ్ అండ్ బ్రేకప్ కు అతీతులు కారంటూ పలు సందర్బాల్లో నిరూపితం అయ్యింది. ఒక యాంకర్ తనదైన టైమింగ్ తో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన లాంటి యాంకర్ రాలేదు అంటూ ప్రతి ఒక్కరు అనుకునేంతగా ఆయన తన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరించి ఆకట్టుకున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ప్రేమ కథలు వైరల్ అవుతున్నాయి.
కొన్నాళ్ల క్రితం ఆ ఫేమస్ యాంకర్ ప్రేమలో పడ్డాడు. ఆ సమయంలో బయటకు అధికారికంగా చెప్పలేదు కాని అందరికి తెలిసేలా పబ్ లకు క్లబ్ లకు తిరిగారు.. ఎంజాయ్ చేశారు.
ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు. అందుకు కారణం ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆ సమయంలో కాస్త సైలెంట్ గా ఉన్న సదరు యాంకర్ తిరిగి కార్యక్రమాలతో బిజీ అయ్యాడు.
ఆ లవ్ బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమించాలనే ఆసక్తి లేదని.. తనకు లవ్ మీద ఇంట్రెస్ట్ పోయిందంటూ వ్యాఖ్యలు చేసిన ఆ యాంకర్ మళ్లీ ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈసారి లవ్ మాత్రమే కాకుండా ఏకంగా సహజీవనం సాగిస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇద్దరి గురించి తెలిసిన వారు చర్చించుకుంటున్నారు.
వారిద్దరు మాత్రం ఎప్పటిలాగే సైలెంట్ గా ఉంటున్నారు. ముందు ముందు ఏమైనా బయట పడతారా లేదంటే.. ఆ యాంకర్ మొదటి లవ్ స్టోరీ తరహా లోనే మళ్లీ వీడి పోతారా అంటూ కొందరు గుసగుసలాడుతున్నారు. మళ్లీ ప్రేమలో పడ్డ ఆ యాంకర్ బుల్లి తెర తో పాటు వెండి తెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇది ఎంత వరకు వర్కౌట్ అయ్యేనో చూడాలి.