రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ జంటగా తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి లీక్ లేదా మరేదైనా సమస్య తో ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. ఆమద్య రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్న సమయంలో జనాలను అదుపు చేయలేక చిత్ర యూనిట్ సభ్యులు ఇబ్బంది పడ్డారు.
ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ వైజాగ్ ఆర్ కే బీచ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దాంతో జనాలు భారీ ఎత్తున ఆర్ కే బీచ్ వద్దకు క్యూ కట్టారు. మొదటి రోజు వందల్లో వచ్చిన జనాలు ఇప్పుడు వేల సంఖ్యలో వస్తున్నారు. రోజు రోజు పెద్ద ఎత్తున జనాలు పెరుగుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఏం చేయాలో పాలుపోక తల పట్టుకుంటున్నారట.
కొందరు యూనిట్ సభ్యుల వద్దకు వచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని.. మరి కొందరు చరణ్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది. వారందరిని అదుపు చేయడం కోసం దిల్ రాజు టీమ్ స్థానిక పోలీసులతో పాటు ఏకంగా 200 నుండి 250 మంది బౌన్సర్ లను షూటింగ్ స్పాట్ లో పెట్టారట. వారు ఎంతగా జనాలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా కూడా ఏదో ఒక చోట ఇబ్బంది కలుగుతుందట.
ఈ వేసవి కాలం ఆర్ కే బీచ్ లో షూటింగ్ అంటేనే చాలా ఇబ్బంది. అలాంటిది జనాల వల్ల షూటింగ్ అనుకున్న సమయంకు జరగక పోవడం వల్ల దిల్ రాజు అదనపు భారం పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో బౌనర్లు షూటింగ్ కు సెక్యూరిటీగా వ్యవహరించాలంటే ప్రతి రోజు ఎంత ఖర్చు చేయాలో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే శంకర్ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో దిల్ రాజు కు బీచ్ లో షూటింగ్ తో బౌన్సర్ల కోసం అదనపు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వైజాగ్ తో పాటు ముఖ్యమైన చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈనెల మూడవ వారం వరకు షూటింగ్ చేయబోతున్నారట.
పరిస్థితి ఇలాగే ఉంటే కాస్త ముందుగానే షూటింగ్ ను ముగించినా ఆశ్చర్యం లేదు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు సినిమా షూటింగ్ ను ముగించి వచ్చే ఏడాది జనరిలో సినిమా ను ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.