'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' అంటూ ఒకే ఒక్క పాటతోనే 'గీత గోవిందం' సినిమాపై దర్శకుడు పరశురామ్ అంచనాలు పెంచేశాడు. ఆ సినిమా విజయంలో ఆ పాట పాత్ర ఉందనేది కాదనలేని వాస్తవం. అలాగే 'కళావతి .. కళావతి' అనే పాటతో అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులను ఆయన 'సర్కారివారి పాట' సినిమావైపు తిప్పేశారు. వ్యూస్ పరంగా .. లైక్స్ పరంగా ఈ పాట కొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ ఉండటంతో, ప్రమోషన్స్ లో పరశురామ్ బిజీగా ఉన్నారు.
తాజా ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడుతూ .. 'గీత గోవిందం' సినిమా సమయంలోనే నేను ఈ కథను సిద్ధం చేసుకున్నాను. ఈ సినిమాను మహేశ్ తో చేయాలని నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. అందుకు అవసరమైన కసరత్తు చేయడం వలన కాస్త గ్యాప్ వచ్చింది గానీ, వేరే ప్రాజెక్టులు రాకపోవడం వలన కాదు. మహేశ్ బాబుగారికి కరెక్షన్స్ చెప్పే అలవాటు లేదు. నచ్చితే నచ్చింది అంటారు .. లేదంటే లేదు అంటారు అంతే. అంతకుమించి ఆయన ఏమీ చెప్పరు.
సీన్ చేసినా .. సాంగ్ చేసినా .. 'మీకు ఓకే కదా' అని మాత్రం అడుగుతారు. ఆయనలో నాకు నచ్చేది అదే!
'సర్కారువారి పాట' టైటిల్ అనుకోగానే వెంటనే మహేశ్ గారికి కాల్ చేసి చెప్పాను ' టైటిల్ అదిరిపోయింది' అన్నారాయన. సినిమా సెట్స్ పైకి వెళ్లిన తరువాత మైత్రీ వారుగానీ .. మహేశ్ బాబుగారు గాని అస్సలు టెన్షన్ పెట్టలేదు.
అవుట్ పుట్ బాగా రావడం కోసం ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ కథలో ఏ వ్యక్తిని కార్నర్ చేసే ప్రయత్నం చేయలేదు. ఒక వ్యవస్థకి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించాము. కోవిడ్ మూడు వేవ్ లను చూశాము. ఆ సమయంలో ఎదురైన పరిస్థితులను తట్టుకున్నాము.
మహేశ్ బాబుగారు నన్ను సొంత బ్రదర్ లా చూసుకునేవారు .. నాకు ఫలానా సమస్య ఉందంటే వెంటనే పట్టించుకునేవారు. ఆ సమయంలో మా ఫాదర్ ఒంట్లో బాగోలేదన్నా .. మా మిసెస్ కి ఒంట్లో బాగోలేదన్నా వెంటనే ఆయన స్పందించేవారు. ఎప్పటికప్పుడు కాల్స్ చేసి నాకు ధైర్యం చెప్పేవారు.
ఏ విషయంలోను ఆయన నాపై చిరాకు పడిన సందర్భాలు లేవు. షూటింగ్ అంతా పర్ఫెక్ట్ గా చేశాము. అవుట్ పుట్ విషయంలో హ్యాపీగా ఉన్నాము. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.