ఆర్కే నాయుడుగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సాగర్.. 'సిద్ధార్థ' అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'షాదీ ముబారక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు హీరో ఆర్కే సాగర్. ''ది 100'' అనే వైవిధ్యమైన టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ని తాజాగా రిలీజ్ చేశారు.
''ది 100'' సినిమాతో రాఘవ్ ఓంకార్ శశిధర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఆర్కే మీడియా వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో విక్రాంత్ అనే ఐపిఎస్ అధికారి పాత్రలో ఆర్కే సాగర్ నటిస్తున్నాడు. ఈరోజు ఆవిష్కరించబడిన టైటిల్ పోస్టర్ లో సాగర్ చేతిలో తుపాకీ పట్టుకొని ఖాకీ యూనిఫాంలో ఉన్నారు. బ్యాక్ సైడ్ పోజ్ లుక్ లో అతని ఇంట్రెన్స్ గా కనిపిస్తున్నాడు.
'ది 100' చిత్రంలో తన పాత్ర కోసం ఆర్కే సాగర్ ఫిట్నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. టైటిల్ పోస్టర్ లో పంచింగ్ హ్యాండ్ ని గమనిస్తే.. ఈ సినిమా యాక్షన్ కి అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ‘ది 100’ మూవీ రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.