భార్య ఇల్లీగల్ వ్యవహారాన్ని బయట పెట్టిన నటుడు!

Update: 2022-05-25 04:13 GMT
హిందీ నటుడు కరణ్‌ మెహ్రా పై భార్య నిషా రావల్‌ గృహ హింస కేసు పెట్టడంతో కొన్నాళ్ల పాటు జైల్లో ఉన్నాడు. కరణ్ మరియు నిషా లు విడి పోయి చాలా రోజులు అవుతుంది. అధికారికంగా విడాకులు తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కరణ్ నుండి భారీ మొత్తంలో నిషా రావల్‌ భరణం డిమాండ్‌ చేస్తుంది అంటూ హిందీ మీడియాలో ఆ మద్య పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఆ విషయమై నిషా రావల్ మాట్లాడుతూ తాను చిన్న వయసు నుండే సంపాదిస్తున్నాను. నాకు ఎలాంటి భరణం అక్కర్లేదు. అయితే కరణ్ నేను కలిసి ఎన్నో ఆస్తులను సంపాదించాము.. అతడి ఆస్తులన్నింటిలో కూడా నాకు భాగస్వామ్యం ఉంది. కనుక అది నాకు వస్తే చాలు అన్నట్లుగా ఆమె భావిస్తుందట. ఆ విషయమై ప్రస్తుతం కోర్టు లో కేసు నడుస్తూ ఉంది. ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుంది అనేది చూడాలి.

మరో వైపు కరణ్ పదే పదే నిషా రావల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. తాజాగా మరోసారి నిషా పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నా ఇంట్లో నిషా తో ఒక వ్యక్తి 11 నెలలుగా ఉంటున్నాడు. అతడు భార్య మరియు పిల్లలను వదిలేసి నా భార్య తో నా ఇంట్లో ఉంటున్నాడు అంటూ సాక్ష్యాధారాలను కూడా మీడియా ముందు కరణ్‌ మెహ్రా ఉంచడంతో ఇప్పుడు ఆ విషయం మీడియాలో పతాక స్థాయిలో చర్చ జరుగుతోంది.

కరణ్ ఇంకా మాట్లాడుతూ.. నిషా అతడితో నా ఆస్తులన్నీంటిని రాబట్టేలా ప్లాన్‌ చేసింది. నా ఇంటిని లాక్కోడంతో పాటు నా కార్లు.. వ్యాపారాలు అన్నింటిని కూడా అతడి సాయంతో నిషా రావల్ దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. అతడు ఇల్లీగల్ గా నా ఆస్తులను అనుభవిస్తున్నాడు అంటూ కరణ్ ఆరోపించాడు. ఇంకా అధికారికంగా కోర్టు విడాకులు ఇవ్వకున్నా నిషా వేరే వ్యక్తితో కలిసి ఉంటుందని ఆరోపించాడు

కరణ్‌ వాదనను నిషా కొట్టి పారేసింది. తన విషయంలో పదే పదే అబద్దాలను కరణ్ ప్రచారం చేస్తున్నాడు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేస్తుంది. తనను ఎంతగానో హింసించిన కరణ్‌ నుండి తాను విడాకుల కోసం ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొంది. అదే సమయంలో తన ఆస్తులకు సంబంధించిన హక్కు విషయమై కూడా కోర్టు లో పోరాడే విషయం గురించి చర్చలు జరుపుతుందట.
Tags:    

Similar News