అనన్య నాగళ్ల పేరు వినగానే అందరికీ కూడా 'వకీల్ సాబ్' సినిమానే గుర్తుకు వస్తుంది. అంతకుముందు ఆమె కొన్ని సినిమాలు చేసినప్పటికీ. ఈ సినిమాతోనే ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతో ఆమె పోషించిన పాత్ర ఎక్కువమందికి కనెక్ట్ అయింది. అందువలన ఆమె క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది.
'మల్లేశం' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమాలో సహజమైన తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత చేసిన 'ప్లే బ్యాక్' సినిమా కూడా యూత్ లో ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
నితిన్ 'మాస్ట్రో' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించిన ఆమె, ఆ తరువాత 'శాకుంతలం' సినిమాలోనూ నటించింది. తెలుగులో తనకి సరైన బ్రేక్ ఇచ్చే ప్రాజెక్టు కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ నుంచి ఆమెకి ఒక ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె కథానాయిక కావడం విశేషం. తమిళంలో శశికుమార్ హీరోగా ఒక ప్రాజెక్టు మొదలైంది. టైమ్ ట్రావెల్ కి సంబంధించిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో కథానాయికగా అనన్య నాగళ్లను తీసుకున్నారు.
'అంజల' ఫేమ్ తంగం పా శరవణన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఆ దిశగానే పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఒక టైమ్ ట్రావెల్ కి సంబధించిన కథను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలనుకోవడం సాహసమే. అనన్య నాగళ్ల ఇంతకుముందు చేసిన 'ప్లే బ్యాక్' కూడా ఈ కథాంశానికి దగ్గరగా ఉన్నదే. అయితే ఈ సినిమా అందుకు పూర్తి భిన్నమైన మార్గంలో వెళుతుంది.
ఈ సినిమాకి సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకి ఆయన అందించే సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను తమిళ .. తెలుగు భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా హిట్ అయితే ఈ రెండు భాషల్లోను ఆమె కెరియర్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి మరి.