ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు బెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ వ‌చ్చేసింది!

Update: 2022-11-12 05:31 GMT
మ‌య‌లాళ ఇండ‌స్ట్రీ యాక్ష‌న్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా మారుతోంది. ఈ త‌ర‌హా సినిమాల‌ని మూమూలు న‌టుల‌తో పాటు సూప‌ర్ స్టార్ లు కూడా చేస్తుండ‌టంతో ఈ త‌ర‌హా సినిమాల‌కు రోజు రోజుకూ ఆద‌ర‌ణ పెగుతూ వ‌స్తోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ ఈ త‌ర‌హా సినిమాల‌కు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తున్న నేప‌థ్యంలో తాజాగా మ‌రో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కావ‌డం మొద‌లైంది. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్లర్ 'రోర్స్చాచ్‌'.

నిస్స‌మ్ బ‌షీర్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌మ్ముట్టి కంప‌నీ బ్యాన‌ర్ పై మ‌మ్ముట్టి న‌టిస్తూ ఈ మూవీని నిర్మించ‌డం విశేషం. మ‌మ్ముట్టికి జోడీగా ఇరా నూర్ న‌టించిన ఈ మూవీలో మ‌మ్ముట్టి దుబాయ్ లో బిజినెస్ చేసే ఎన్నారైగా న‌టించాడు. గ‌ర్భ‌వ‌తి అయిన త‌న భార్య‌ని తీసుకుని కేర‌ళ వ‌చ్చిన ఆంటోనీ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది? .. రోడ్ యాక్సిడెంట్ త‌రువాత కోమాలోకి వెళ్లిన ఆంటోని మెల‌కువలోకి వ‌చ్చాక  త‌న భార్య సోఫియా ఎలా మిస్స‌యిందని తెలుసుకుంటాడు. ఆ త‌రువాత త‌న‌ని వెత‌క‌డం కోసం ఏం చేశాడు?

ఈ క్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న స‌వాళ్లేంటీ? చివ‌రికి త‌న వైఫ్ ని చేరుకున్నాడా? త‌ఎర వెనుక జ‌రిగిన మిస్ట‌రీ ఏంటీ? .. దాని వెన‌క ఎవ‌రున్నార‌న్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ‌. ఆత్యంత ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో థ్రిల్ కి గురిచేసే క‌థా, క‌థ‌నాల‌తో సాగే ఈ మూవీ ఈ మ‌ధ్య కాలంలో మ‌ల‌యాళంలో వ‌చ్చిన బెస్ట్ థ్రిల్ల‌ర్ గా చెబుతున్నారు. స్లో న‌రేష‌న్ తో సాగినా అడుగ‌డుగున్నా థ్రిల్ చేసే క‌థ‌నంతో సాగుతూ ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

అక్టోబ‌ర్ 7న దుల్క‌ర్ స‌ల్మాన్ త‌న వే ఫెరేర్ ఫిలింస్ బ్యాన‌ర్ పై కేర‌ళ వ్యాప్తంగా రిలీజ్ చేసిన ఈ మూవీ న‌వంబ‌ర్ 11 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అత‌ల్యంత త‌క్కువ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు రూ.

40 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ఔరా అనిపించింద‌ట‌. ఓటీటీలో ఈ మూవీ మ‌ల‌యాళ‌, తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. థ్రిల్ల‌ర్ సినిమాలు చూడాల‌ని కోరుకునే ప్రేక్ష‌కుల‌కు ఈ మూవీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News