స్పీల్బర్గ్ కూడా సూపర్ స్టారుకు భయపడిండు

Update: 2016-07-09 14:03 GMT
మొన్నటివరకు హాలీవుడ్ వారి పెద్ద సినిమాలు వస్తున్నాయంటే.. మన ఇండియా సినిమాలు కాస్త జంకాల్సి వచ్చేది. ఎందుకంటే ది జంగిల్‌ బుక్ వంటి సినిమాలో ఇండియాలో వందల కోట్లు వసూళ్ళు చేశాయి. అప్పటినుండి మన సినిమాలను వాటికి పోటీ విడుదల చేయాలంటే మనోళ్లకు కాస్త భయం వేస్తోంది. కాని ఇప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్ సైతం తాను తీసిన ''ది బి.ఎఫ్‌.జి'' సినిమాను ఇక్కడ విడుదల చేయడానికి కాస్త సంశయిస్తున్నాడు. అదంతా సూపర్ స్టార్‌ రజనీకాంత్ ఎపెక్ట్.

నిజానికి జూలై 1న ''కబాలి'' సినిమా వస్తుందనుకొని.. జూలై 15న ది బిఎఫ్‌ జి సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకోవట్లేదట. ఎందుకంటే కబాలి సినిమా జూలై 22కి పోస్టుపోన్ అయ్యింది కాబట్టి. కేవలం ఒక వారం మాత్రమే ధియేటర్లలో ఉండి తరువాత ఇంటికెళ్ళిపోవడానికి హాలీవుడ్‌ సినిమా వారికి మాత్రం సరదానా ఏంటి. అందుకే ఇప్పుడు స్పీల్బర్గ్ సినిమా అయినా కూడా కబాలి దగ్గర కాస్త వెనక్కి తగ్గి.. జూలై 29న కాని.. ఆ తరువాత మరేదైనా కొత్త తారీఖున కాని రిలీజ్ చేస్తారట.

ఈ సినిమా తెలుగు వర్షన్‌ కు జగపతి బాబు జైంట్ కోసం వాయిస్‌ అందివ్వడంతో.. ఇప్పుడు సినిమాపై క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.
Tags:    

Similar News