టాలీవుడ్ ఎపుడూ రాజకీయాల జోలికి పోదు, అదే సమయంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వారితో పాటు ఉంటూ తమ సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తుంది. అయితే జగన్ విషయంలో మాత్రం ఇందుకు భిన్నమైన తీరునే టాలీవుడ్ కనబరుస్తోంది అంటున్నారు. జగన్ సీఎం అయ్యాక ఆయనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి విషెస్ ఎవరూ చెప్పలేదు అన్న విమర్శలు ఉన్నాయి. టాలీవుడ్ లో పెద్ద తలకాయలు అనిపించుకున్న వారు కూడా ఎందుకో అనాడు సైలెంట్ అయిపోయారు. అయితే ఆ తరువాత కొన్నాళ్ళకు మెగాస్టార్ చిరంజీవి జగన్ ఇంటికి వెళ్ళి విందారగించి వచ్చారు. ఆ మీదట సినీ ప్రముఖులతో ఒక సిట్టింగ్ కూడా గత ఏడాది జరిగింది. ఇక గాడిలో పడింది అనుకున్నంతలో ఆన్ లైన్ టికెటింగ్ విధానం తెరపైకి రావడంతో మళ్ళీ టాలీవుడ్ తో గ్యాప్ పెరిగింది అంటున్నారు.
ఆన్ లైన్ టికెటింగ్ విధానం ద్వారా టాలీవుడ్ లో బడా హీరోల సినిమాలకు పెద్ద దెబ్బ పడుతోంది. పెద్ద హీరో సినిమాలకు రేట్లు అనూహ్యంగా పెంచుకోవడం, అదనపు షోలు వేయడం వంటి వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్ కూడా ఎగ్గొడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దాంతో ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ ని తీసుకు వస్తోంది. దీని ద్వారానే టికెట్లు అమ్మాలి. అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే అమ్మాలి. అదనపు షోలు ఇక ఉండవు.
ఇలా సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు కూడా తెస్తున్నారు. దీంతో టాలీవుడ్లో అటు బడా హీరోలతో పాటు మేకర్స్ కూడా గుస్సా మీద ఉన్నారని అంటున్నారు. ఎపుడైతే ఆన్ లైన్ టికెటింగ్ తెర మీదకు వచ్చిందో నాటి నుంచి టాలీవుడ్ తో ప్రభుత్వానికి సంప్రదింపులు పెద్దగా లేకుండా పోయాయి. అయితే ఆన్ లైన్ టికెటింగ్ విధానం మీద సంబంధిత మంత్రి పేర్ని నాని ఇది ప్రభుత్వం ఆలోచన అంటున్నారు. ప్రజలకు ఏ వ్యవస్థ అయినా దోపిడీ చేయకుండా చూడడమే ప్రభుత్వ బాధ్యత అని అంటున్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండానే ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని రూపొందించామని కూడా చెబుతున్నారు. వైసీపీ ఈ విషయంలో గట్టిగానే ఉంది. అందుకే చర్చలు జరిపినా ఉపయోగం లేదనే సినీ పెద్దలు ఈ వైపు చూడడంలేదు అంటున్నారు.
దాంతో పాటు వారు ఏపీలో ప్రకృతి వైపరిత్యాల మీద కూడా పెద్దగా స్పందించడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి.ఇక టాలీవుడ్ హీరోలు ఎపుడూ ఎపీలో ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేవారు. అలాంటిది రాయలసీమ నాలుగు జిల్లాలు జల ప్రళయంతో అల్లాడుతున్నా కూడా కనీసం స్పందించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మా ఎన్నికల ప్రభావం కూడా దీని వెనక ఉందని అంటున్నారు. మొత్తానికి చరిత్రలో కనీవినీ ఎరగని విలయంతో ఏపీ జిల్లాలు ఉంటే టాలీవుడ్ నుంచి కనీస స్పందన లేకపోవడం పైన చర్చ సాగుతోంది. టాలీవుడ్ తో ఏపీ సర్కార్ కి నిజంగా గ్యాప్ ఏర్పడిందా. టాలీవుడ్ నుంచి ఇక మీదట ఏ రియాక్షన్ ఉండదా, ఏపీ సర్కార్ రానున్న రోజులల్లో పెద్దలు సంప్రదింపులు ఏమైనా జరిపే అవకాశం ఉందా ఇవన్నీ ప్రశ్నలే. వీటికి జవాబు మాత్రం తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.