సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం కేసు గత మూడు నెలల నుండి రోజులు గడిచేకొద్దీ డర్టీగా మారుతోంది. జూన్ 14 న సుశాంత్ తన ముంబై నివాసంలో చనిపోయాడు. అప్పటినుండి సుశాంత్ అకాల మరణం గురించి అనేక రకాల కథనాలొచ్చాయి మీడియాలో. ఈ కేసులో ఫౌల్ ప్లే గురించి విభిన్నమైన ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు చివరికి సిబిఐకి బదిలీ చేయడం సంచలనమైంది.
సీబీఐ ఏజెన్సీ ఈ కేసును పరిశీలించే క్రమంలో తీగ లాగితే డొంక కదిలిన చందంగా సన్నివేశం తయారైంది. సుశాంత్ - రియాలతో సంబంధం ఉన్న పెద్ద మనుషులందరికీ ఇది తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇప్పటివరకు సుశాంత్ ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పిథానీని ఈ కేసులో సిబిఐ ప్రశ్నించిన సంగతి తెలిసినదే.
తాజా విషయం ఏమిటంటే పిథాని సిబిఐకి ఇచ్చిన లీకుల్లో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారని తెలిసింది. ప్రఖ్యాత జాతీయ మీడియా వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం జూన్ 8 న దిశా సాలియన్ దురదృష్టవశాత్తు మరణించిన తరువాత సుశాంత్ తనకు ప్రాణభయం ఉందని భయపడ్డాడట. ``నన్ను చంపేస్తారు!`` అని సుశాంత్ తనతో చెప్పాడని అతను సీబీఐ కి చెప్పాడు. అంతేకాకుండా.. దిశా మరణం తరువాత దివంగత నటుడు తన భద్రతను పెంచుకోవాలని భావించాడని పిథాని పేర్కొన్నారు.
అంతేకాకుండా.. రియా చక్రవర్తి స్వయంగా సుశాంత్ ల్యాప్ టాప్ అలాగే హార్డ్ డ్రైవ్ తో వెళ్లిందని సిద్ధార్థ్ వెల్లడించాడు. తాజా పరిణామంతో సిబిఐ ఇప్పుడు దిషా - సుశాంత్ మరణాల మధ్య ఉన్న అన్ని సంబంధాలను పరిశీలిస్తోంది. మరోవైపు రియా ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసినప్పటి నుండి జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. బాలీవుడ్ లో 25 మంది ఎ-లిస్టర్ల పేర్లను వెల్లడించిందని జాతీయ మీడియా చెబుతోంది. ఇందులో నెపోటిజం స్టార్ సారా అలీ ఖాన్ - రకుల్ ప్రీత్ సింగ్ ల పేర్లు లీకయ్యాయన్న గుసగుసలు వేడెక్కించాయి. అయితే దీనిని ఎన్.సి.బి వాళ్లు అధికారికంగా ధృవీకరించలేదు. అలాగే రియా చక్రవర్తి సుశాంత్ తో కలిసి మాదకద్రవ్యాల్ని సేవించినట్లు తనే అంగీకరించిందన్న వాదనా మీడియా వినిపిస్తోంది.