విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకరిగా 'వికటకవి'గా తెనాలి రామకృష్ణ ప్రసిద్ధి చెందాడు. తెనాలి రామకృష్ణుడు గురించి ఇప్పటి వరకు అనేక సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు పురాణ కవి తెనాలి రామకృష్ణ ఆధారంగా ''ధీర'' అనే యానిమేషన్ ఫిల్మ్ రూపొందుతోంది. దీనికి 'బుద్ధి రిద్ధి సిద్ధి' అనేది ఉపశీర్షిక. భారతదేశపు అతిపెద్ద మోషన్ క్యాప్చర్ ఫీచర్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణ్ కుమార్ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా 'ధీర' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
కాగా, 'ధీర' యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ 'ధీర' పాన్ ఇండియా లెవల్లో 12 భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి వివిధ భాషల్లో పలువురు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని తెలుస్తోంది. 'ధీర' హిందీ వర్షన్ కి బాలీవుడ్ స్టార్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్.. తెలుగు వర్షన్ కి టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తమిళ్ లో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి.. బెంగాలీ భాషలో జీత్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ మురళి సంగీతం సమకూరుస్తున్నారు. ఏ థీరమ్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ 'ధీర' యానిమేషన్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.