'య‌మ‌గోల‌' ద‌ర్శ‌కుడు ఇక లేరు

Update: 2022-04-20 08:32 GMT
తెలుగులో క్రేజీ స్టార్ల‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ని అందించి హిందీ చిత్ర సీమ‌లో క్రేజీ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న వాళ్లు అతి త‌క్కువ మందే వున్నారు. వారిలో ప్ర‌ముఖంగా చెప్పుకోద‌గ్గ ద‌ర్శ‌కుడు తాతినేని రామారావు (83). ద‌క్షిణాదిలో అనేకి చిత్రాల‌ని తెర‌కెక్కించి ఇక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిల‌వ‌డంతో అదే చిత్రాల‌ని హిందీలోనూ రీమేక్ చేసి అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ లు మలిచి ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న ఆయ‌న అర్థ్ర‌రాత్రి అనారోగ్య కార‌ణాల వ‌ల్ల చెన్నైలో క‌న్నుమూశారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు బుధ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు క‌న్న‌మ్మ‌పేట‌లో జ‌ర‌గ‌నున్నాయి.

తెలుగు, హిందీ భాష‌ల్లో 70కి పైగా చిత్రాల‌ని రూపొందించిన ఆయ‌న 1966లో వ‌చ్చిన త‌మిళ హిట్ ఫిల్మ్ 'న‌వ‌రాత్రి' రీమేక్ తో ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, సావిత్రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం అనూహ్య విజ‌యాన్ని సాధించింది. ద్వితీయ ప్ర‌య‌త్నంగా ఆయ‌న చేసిన చిత్రం 'బ్ర‌హ్మ‌చారి' ఇందులోనూ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావే. హీరోయిన్ మాత్రం జ‌య‌ల‌లిత‌.

ఇదే చిత్రం హిందీలోనూ రీమేక్ అయింది. ఆ త‌రువాత జీవ‌న త‌రంగాలు, దొర‌బాబు, య‌మ‌గోల చిత్రాలు వ‌రుస‌గా చేశారు. 'య‌మ‌గోల‌' చిత్రాన్ని హిందీలో 'లోక్ ప‌ర్లోక్‌' పేరుతో జితేంద్ర హీరోగా రీమేక్ చేశారు. తాతినేని రామారావుకు హిందీలో ఇదే తొలి చిత్రం. ల‌క్ష్మీ కాంత్ న్యారేలాల్ సంగీతం అందించిన ఈ చిత్రం అక్క‌డ సెన్సేష‌న‌ల్ హిట్ గా నిలిచి ద‌ర్శ‌కుడిగా తాతినేని రామారావుకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

టాలీవుడ్ లో వున్న టాప్ హీరోలైన ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, శోభ‌న్ బాబు,కృష్ణ‌, బాల‌కృష్ణ‌, శ్రీ‌దేవి, జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద వంటి టాప్ స్టార్ ల‌తో క‌లిసి ప‌ని చేశారు. హిందీలో ర‌జ‌నీకాంత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, అనిల్ క‌పూర్‌, జితేంద్ర‌, గోవింద‌, మిధున్ చ‌క్ర‌వ‌ర్ది, వినోద ఖ‌న్నా వంటి వారితో సినిమాలు తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ లు అందుకున్నారు. తెలుగులో సూప‌ర్ హిట్ లుగా నిలిచిన చాలా చిత్రాల‌ని హిందీలో రీమేక్ చేసి హిట్ చేశారు. అలాగే హిందీలో చేసిన సినిమాల‌ని తెలుగులో రీమేక్ చేసి అదే స్థాయిలో సూప‌ర్ హిట్ లు అందుకున్నారు.

తెలుగులో విజ‌యం సాధించిన 'అలుమ‌గ‌లు' చిత్రాన్ని హిందీఓల 'జుదాయి'గా, కార్తీక దీపం ను 'మాంగ్ భ‌రో స‌జ‌నా'గా, 'అంతులేని క‌థ‌'ను 'జీవ‌న ధార‌'గానూ రీమేక్ చేశారు. ముగ్గురు మిత్రులు'ని 'దోస్తీ దుష్మ‌నీ'గా, 'చ‌ట్టానికి క‌ళ్లులేవు' చిత్రాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌జీకాంత్ ల‌తో 'అంధా కానూన్‌' గానూ రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌ని సొంతం చేసుకున్నారు. మ‌యూరిని 'నాచే మ‌యూరి'గా పెద‌రాయుడు చిత్రాన్ని బులందీగా తెర‌కెక్కించి సూప‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకున్నారు.

 హిందీలో ఆయ‌న తెర‌కెక్కించిన చివ‌రి చిత్రం 'బేటీ నెం.1'. గోవిందా, రంభ జంట‌గా న‌టించిన ఈ మూవీ కూడా అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. 22 ఏళ్లుగా సినిమాల‌కు దూరంగా వుంటున్న ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలిసి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News