ప్రదీప్ హీరోగా రూపొందిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో హీరో గా నటించిన ప్రదీప్ మాట్లాడుతున్న సమయంలో దర్శకుడు మున్నా కళ్లు తిరిగి కింద పడిపోయాడు. ప్రదీప్ మాట్లాడుతున్న సమయంలో వెనుకే ఉన్న దర్శకుడు మున్నా మొదట తల తిరుగుతున్నట్లుగా అనిపించడంతో తల పట్టుకుని ఉన్నాడు. ఆ కొద్ది సేపటికే కుప్పకూలిపోయాడు.
వెంటనే అక్కడ ఉన్న వారు అతడిని సీటులో కూర్చోబెట్టి కాస్త సపర్యలు చేయడంతో తేరుకున్నాడు. ఆ తర్వాత మామూలుగానే మాట్లాడుతూ తన సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ఎక్కువ సమయం నిల్చుని ఉండటంతో పాటు లైట్ ఫోకస్ లు ఎక్కువగా కొట్టడం వల్ల కింద పడ్డట్లుగా చెప్పుకొచ్చాడు. సినిమా గురించి మాట్లాడిన మున్నా తన గురించి ఆందోళన అక్కర్లేదు అన్నాడు. తాను బాగానే ఉన్న మున్నా తప్పకుండా సినిమాతో మిమ్ములను ఆకట్టుకుంటాను అన్నాడు. దర్శకుడు స్టేజ్ పై కింద పడిపోవడంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలు కాస్త వైరల్ అయ్యాయి.
Full View