యూ ట్యూబ్ లో హిట్ సాంగ్స్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. వాటిని సినిమాల్లో సైతం రిమిక్స్ చేసి సినిమాకి ఊపు తీసుకొస్తున్నారు. ఈ ట్రెండ్ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీకాకకుళం యాసలో సాగే 'నాది నక్కలీసు గొలుసు' సాంగ్ ని 'పలాస' సినిమాలో రీమిక్స్ చేయడంతో? ఆ పాట పెద్ద సక్సెస్ అయింది.
సోషల్ మీడియాని షేక్ చేసిన సాంగ్ గా నిలిచింది. 'జారు మిఠాయ్' సాంగ్ 'జిన్నా'లోనూ అంతే ఫేమస్ అయింది. అంతకు ముందు 'ఎఫ్-3' లో 'కుర్రాడు బాబోయ్ కుంపటెక్కినాడు' అలాగే సంచలనం సృష్టించింది. ఇందులో వెంకటేష్ వేసిన స్టెప్పులు.. ఎక్స్ ప్రెషన్స్ తో ఈ పాట మరోసారి ఇండస్ర్టీని షేక్ చేసింది. ఇది వెంకీ సినిమాలో ఓల్డ్ సాంగ్ అయినా రిమిక్స్ రూపం మాస్ లోకి దూసుకు పోయింది.
అలాగే ఇటీవలే మాస్ మహారాజ రవితేజ నటించిన 'ధమాకా' సినిమాలోనూ ఇలాంటి నెంబర్ ఒకటి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. 'పల్సర్ బైక్' సాంగ్ తో రాజా అండ్ శ్రీలీల ఏ రేంజ్ లో డాన్సులు ఇరగ దీసారో తెలిసిందే.
కండెక్టర్ జాన్సీ స్టెప్పుల్ని ఇద్దరు దించేసారు. మాస్ రాజాకి ఇలాంటి పాట ఒకటి పడితే అది హిట్ అనడానికి ఇదొక సంకేతం.
ఇలాంటి పాటల్లో రవితేజ చెలరేగిపోతాడు. ఇంతకు ముందు 'జీడి గింజలు పాట'లో అంతే రచ్చ చేసాడు. 'జీడి గింజలు' ప్రయివేట్ సాంగ్ . దాన్ని రవితేజ ఎత్తుకోవడంతో ఆ సాంగ్ ఎక్కడికే రీచ్ అయింది. ఆ రకంగా డీజే రీమిక్స్ సాంగ్స్ కి సినిమాల ద్వారా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. జానపద కళాకారులు..ఎంతో మంది ఔత్సాహికులు ఇలాంటి పాటల ద్వారా వెలుగులోకి వస్తున్నారు.
అక్కడ నుంచి సినిమాలకు ప్రమోట్ అవుతున్నారు. ఇదంతా కేవలం సోషల్ మీడియా ద్వారానే సాధ్యమవుతుంది. యూట్యూబ్.. ఇన్ స్టా..ట్విటర్....ఫేస్ బుక్... వాట్సాప్ వంటి మాధ్యమాలు ఎంతో మంది కళకారుల జీవితాల్ని రాత్రికి రాత్రే మార్చేస్తున్నాయి. ప్రతిభ ఉండి వాటిని సక్రమమైన పద్దతిలో వినియోగించుకోగల్గితే వాటిని మించిన గొప్ప సాధనలు లేవు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.