తమిళ స్టార్ హీరో ధనుష్ హాలీవుడ్ మూవీ 'ది ఎక్స్ ట్రార్డనరీ జర్నీ ఆఫ్ పకిరి'. ఈ చిత్రం ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ చిత్రంను ప్రదర్శించడం జరిగింది. నటుడిగా ధనుష్ కు మంచి పేరును ఈ చిత్రం తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలో దనుష్ స్ట్రీట్ మెజీషియన్ గా నటించాడు. తండ్రి కోసం ముంబై నుండి ఫ్యారిస్ కు వెళ్లే యువకుడి పాత్రలో ధనుష్ కనిపించాడు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రంను తమిళంలో ఇప్పుడు విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంకు 'పకిరి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. తమిళ ప్రేక్షకుల్లో ధనుష్ కు సూపర్ స్టార్ డం ఉంది. అందుకే ఈ చిత్రం తప్పకుండా మంచి వసూళ్లను రాబడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ధనుష్ గతంలో పలు విభిన్నమైన పాత్రలు చేసి మెప్పించాడు. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తమిళ ప్రేక్షకులను అలరిస్తాడేమో చూడాలి. తమిళంలో హిట్ అయితే హిందీ మరియు తెలుగు భాషల్లో కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
ధనుష్ గత చిత్రం 'మారి 2' ఒక మోస్తరు సక్సెస్ ను దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత ధనుష్ నుండి 'పకిరి' చిత్రం రాబోతుంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆ మూవీ రాబోతుంది. ధనుష్ డబుల్ రోల్ పోషిస్తున్న ఆ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'పకిరి' చిత్రం ధనుష్ స్థాయిని పెంచింది. కనుక తమిళంలో ఈ చిత్రంను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విడుదల చేస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.