ఆస్కార్ వేటలో ఆగిపోయిన‌ సూర్య పోరాటం..ఇంకాస్త‌ ముందుకు వెళ్తేనా..!

Update: 2021-03-16 16:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య - అప‌ర్ణ బాల‌ముర‌ళి జంట‌గా సుధాకొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సూరారై పోట్రు’. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో న‌వంబ‌ర్ 12న ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఒక బ‌యోపిక్ లాంటి సినిమాకు అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులూ జోడించి, అద్భుతంగా ఆవిష్క‌రించారు సుధా. ఈ సినిమా చూసి అబ్బుర‌ప‌డిన ఆస్కార్ క‌మిటీ.. అవార్డు వేట‌లో నిలిపింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా 366 చిత్రాలు ఆస్కార్ బ‌రిలో నిల‌వ‌గా.. భార‌త్ నుంచి ‘సూరారై పోట్రు’కు మాత్ర‌మే ఆ ఛాన్స్ ద‌క్క‌డం విశేషం. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ డైరెక్ష‌న్‌, ఉత్త‌మ ఒరిజిన‌ల్ స్కోర్ విభ‌గాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల‌కు నామినేట్ అయ్యింది. దీంతో.. చిత్ర బృందంతోపాటు అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్య‌క్తంచేశారు.

కానీ.. అకాడ‌మీ స్క్రీనింగ్ త‌ర్వాత రౌండ్స్ కు ఈ చిత్రం నామినేట్ కాలేక‌పోయింది. సోమ‌వారం ప్ర‌క‌టించిన ఫ‌లితాలతో.. ఈ సూరారై పోట్రు ఆస్కార్ వేటను అధికారికంగా ముగించిన‌ట్లైంది. మరికొన్ని రౌండ్లు ముందుకు వెళ్తే.. తప్పకుండా ఏదో ఒక విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చేదని చిత్రయూనిట్ ఆవేదన చెందుతోంది. ఈ 93వ ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం ఏప్రిల్ 25న అట్టహాసంగా నిర్వ‌హించ‌నున్నారు.


Tags:    

Similar News