ఇటీవలి కాలంలో అందరి దృష్టిని ఆకర్షించిన అత్యంత ఆసక్తికరమైన సినిమాల్లో ఒకటి నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సినిమా AK Vs AK. టైటిల్ కి తగ్గట్టే ఈ సినిమా కాన్సెప్ట్ ఆద్యంతం ఆసక్తికరం. భారతీయ సినిమా హిస్టరీలో తొలి `హోస్టేజ్ థ్రిల్లర్`గా రికార్డులకెక్కిన ఈ సినిమాపై సౌత్ దృష్టి సారిస్తుందనే అంచనాలేర్పడ్డాయి.
అనిల్ కపూర్ - అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నిజమైన కథ లేదా నిజమైన పాత్రలతో కూడిన కల్పిత కథ అంటూ ఒకటే ప్రచారం అయితే సాగుతోంది.
ఓ ఇంటర్వ్యూలో అనీల్ కపూర్ చెప్పిన సినిమా కథాంశం ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుంది. ఏకేని ఏకే (కపూర్) అవమానిస్తాడు. అందుకని ఒక పాఠం నేర్పించాలని అనీల్ కుమార్తె సోనమ్ కపూర్ ని కిడ్నాప్ చేసి తనని వెతకాల్సిందిగా కశ్యప్ బలవంతం చేస్తాడు. మొత్తం సెర్చ్ ఎపిసోడ్ నేపథ్యంలో చిత్రీకరించబడుతుంది. ఇది భారతదేశం మొట్టమొదటి `హోస్టేజ్ థ్రిల్లర్ గా రికార్డులకెక్కింది.
కానీఅనిల్ చివర్లో ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. అది ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. కథ కంటే ఇది దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే స్క్రీన్ ప్లే మహత్మ్యం అత్యద్భుతంగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా అనిల్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. ఏకే అండ్ ఏకే ఇద్దరూ ఒకరిపై ఒకరు వ్యంగ్యంగా కనిపిస్తూ.. మైమరిపిస్తారు. ఈ స్వభావాల్ని వారి రియల్ లైఫ్ నుంచి తీసుకున్నవేనట. ఇందులో హర్షవర్ధన్ కపూర్ అతిథి పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.
ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంలో మన స్టార్లు ఎందుకు నటించలేదు? అని తెలుగు ఆడియెన్ భావించేంత అందంగా ఉంటుందిట. మన స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ తో కలిసి ఇలాంటి ఓ ప్రయోగం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నంతగా ప్రశంసలు దక్కించుకుంది ఏకే అండ్ ఏకే. ఇంతకీ టాలీవుడ్ లో ఈ సినిమాని రీమేక్ చేసే ఆలోచన ఎవరు చేస్తారు? అన్నది ఆసక్తికరం.