దసరా కానుకగా అక్టోబర్ 5న తెలుగు స్టార్ హీరోలు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మరియు నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు సందడి చేసేందుకు రాబోతున్న నేపథ్యంలో సినీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు ఆసక్తిగా చూస్తున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం ఇలా ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవ్వడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఇలా జరగడం లేదు. కనీసం గ్యాప్ ఉండేలా నిర్మాతలు చర్చలు జరుపుకుని మరీ ముందస్తుగా నిర్ణయాలు తీసుకుని విడుదల ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ చిరు మరియు నాగ్ లు పోటీకే సిద్ధం అన్నట్లుగా అక్టోబర్ 5న విడుదల కు సిద్ధం అయ్యారు.
ఈ రెండు సినిమాల్లో ఎవరి సినిమా ఆధిపత్యం కనబర్చుతుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ప్రస్తుతానికి నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా ఆధిపత్యం లో కొనసాగుతుంది అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగార్జున గత కొన్నాళ్లుగా సినిమాకు సంబంధించిన హడావుడి సోషల్ మీడియా ద్వారా లేదా మరో రకంగా చేస్తూనే ఉన్నారు.
సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ స్టఫ్ ని రెగ్యులర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా సినిమా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. దాంతో గాడ్ ఫాదర్ కంటే కూడా ది ఘోస్ట్ కి ప్రస్తుతం నెట్టింట హైప్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదల తర్వాత పరిస్థితి ఏంటో కానీ ఇప్పటి వరకు ది ఘోస్ట్ ఆధిపత్యం కొనసాగుతుందని అంటున్నారు.
నాగార్జున ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్ర చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కు నెగటివ్ టాక్ వచ్చినా కూడా పాజిటివ్ గానే వసూళ్లు ఉన్నాయి. అందుకే ది ఘోస్ట్ సినిమాను తెలుగు తో పాటు హిందీలో కూడా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
అక్కడ కూడా ఒక స్థాయి వరకు థియేటర్లలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్ కూడా అక్కడ నార్మల్ గానే చేయబోతున్నారట. గాడ్ ఫాదర్ మాత్రం హిందీ రిలీజ్ పై ఆసక్తిని కనబర్చడం లేదు అనే విషయం తెల్సిందే. ఆ విషయంలో కూడా ఘోస్ట్ ఆధిపత్యం కనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.