టాలీవుడ్.. బాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ లైగర్. ఫ్యాన్స్ ముద్దుగా 'రౌడీ' అంటూ పిలుచుకోవటంతో పాటు.. అతన్ని ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి విజయ్ కు ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న విషయం లైగర్ ప్రమోషన్ పుణ్యమా అని బయటకు వచ్చింది.
ఈ వారం విడుదలవుతున్న ఈ మూవీ ప్రమోషన్లను మరింత ఊపందుకున్నాయి. ఇప్పటికి ప్రచారం మిగిలి ఉన్న రాష్ట్రాల్లో టీం పర్యటిస్తోంది. ఇలాంటి వేళ.. కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన లైగర్ ప్రమోషన్ లో ఒక క్యూట్ మూమెంట్ చోటు చేసుకుంది.
విజయ్ ను విపరీతంగా అభిమానించే తేజు అనే బెంగళూరు యువతి 'రౌడీ'ని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. తన వెంట తెచ్చుకున్న రింగ్ ను విజయ్ చూపుడు వేలికి తొడిగింది. ఎవరి కన్ను పడకూడదంటూ.. రింగ్ సేవ్ చేయాలని కోరుకుంటూ మోకాలి మీద కూర్చొని విజయ్ వేలికి తొడిగింది. భావోద్వేగంతో ఉన్న తేజును చూసి విజయ్ సైతం ఎమోషన్ అయ్యారు. విజయ్ వేలికి ఉంగరం తొడిగిన తేజు కన్నీళ్లు పెట్టేసుకుంది.
దీంతో.. తన అభిమాని ఎమోషన్ ను అర్థం చేసుకున్న విజయ్.. ఆమెను సున్నితంగా దగ్గరకు తీసుకొని తల మీద చేయి వేసి.. ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆమె వీపును నిమిరి సాంత్వనకు గురి చేశారు. తనకు రింగు తొడిగిన తేజుతో మాట్లాడిన విజయ్.. లైగర్ ప్రమోషన్ పూర్తి అయ్యే వరకు ఉంగరం తీయనని మాటిచ్చాడు. ఈ సందర్భంగా తేజు విపరీతంగా ఎమోషన్ అయ్యింది. ఆమె అభిమానంలో తడిచి ముద్దైన విజయ్..ఆమెకు బై చెప్పి పంపారు.
దీనికి సంబంధించిన చిట్టి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓపక్క లైగర్ ను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే.. మరోవైపు మూవీ ప్రమోషన్ వేళ.. అభిమానులు చూపిస్తున్న అభిమానంతో తడిచి ముద్దవుతున్నారు విజయ్. విజయ్ కు రింగు తొడిగిన తేజు.. తాజాగా ఈ వీడియోను షేర్ చేసి.. 'మై బేబీ' అంటూ తన ప్రేమనంతా పోస్టులో ఒలకబోసేశారు.
Full View