జగపతిబాబు .. బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. అక్కినేని నాగేశ్వరరావుకి అనేక హిట్లు ఇచ్చిన జగపతి పిక్చర్స్ అధినేత వీబీ రాజేంద్రప్రసాద్ తనయుడు. వైజాగ్ లో ఫర్నీచర్ షాప్ నిర్వహణ చూసుకునే జగపతిబాబుకి నాగార్జున మంచి స్నేహితుడు. నాగ్ సినిమాల్లోకి రావడంతో, జగపతిబాబు కూడా సినిమాల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అలా సొంత బ్యానర్లో హీరోగా ఆయన అడుగులు మొదలయ్యాయి. ఆరంభంలో విజయాలు పలకరించకపోయినా ఆయన పట్టుదలతో ముందుకు సాగారు.
టాలీవుడ్ లో పవర్ఫుల్ గా .. ప్రత్యేకంగా అనిపించే కళ్లు ఇద్దరికీ మాత్రమే ఉన్నాయి. ఒకరు చిరంజీవి అయితే .. మరొకరు జగపతిబాబు. ఇక ఆయనకి వాయిస్ కూడా ప్లస్ అయింది. ఆరంభంలో ఒత్తులు పలకడం లేదనే విమర్శలు వచ్చినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. గట్టి పోటీ ఉన్నప్పుడే హీరోగా బరిలోకి దిగిన జగపతిబాబు తనని తాను మార్చుకుంటూ ముందుకు వెళ్లారు. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు ఆయనను ఫ్యామిలీ హీరోను చేశాయి. ఇద్దరు హీరోయిన్లతో సినిమాలు చేస్తూ కొన్నాళ్లు ఆయన శోభన్ బాబు దారిలో నడిచారు.
సాఫ్ట్ క్యారెక్టర్స్ ను మాత్రమే కాదు .. రఫ్ క్యారెక్టర్స్ ను కూడా ఆయన అద్భుతంగా పండించగలడని 'గాయం' .. 'అంతఃపురం' సినిమాలు చెబుతాయి. ఆ తరువాత వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో సహజంగానే ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లోనే విలన్ వేషాలు వేయడానికి కూడా ఆయన సిద్ధపడ్డారు. తన తోటి హీరోలు .. తనకంటే ముందుగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లంతా హీరోలుగా ఉంటే, తాను విలన్ పాత్రలు వేయవలసి రావడం ఎవరి మనసుకైనా కాస్త కష్టంగానే అనిపిస్తుంది.
అలాంటి పరిస్థితిని అధిగమించి 'లెజెండ్' సినిమాతో విలన్ గా మారిన జగపతిబాబు, అప్పటి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఒక వైపున ఫాదర్ పాత్రలు వేస్తూనే .. మరో వైపున ప్రతినాయక పాత్రలతో బిజీ అయ్యారు. ఆయన కార్పొరేట్ విలనిజానికి 'నాన్నకు ప్రేమతో' సినిమా అద్దం పడితే, గ్రామీణ నేపథ్యంలో ఆయన విలనిజానికి 'రంగస్థలం' .. 'అరవింద సమేత' సినిమాలు కొలమానంగా నిలుస్తాయి. జగపతిబాబు పవర్ఫుల్ కళ్లు .. రఫ్ వాయిస్ ఆయన విలన్ పాత్రలకు మరింత బలంగా నిలిచాయి.
అప్పటివరకూ ఇతర భాషల్లోని విలన్స్ పై ఆధారపడిన టాలీవుడ్, ఇక ఆ అవసరం లేదు అన్నట్టుగా జగపతిబాబుకి అవకాశాలు ఇస్తూ వెళుతోంది. హీరోగా టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఆయన, విలన్ గా ఇతర భాషల్లోను బిజీ అయ్యారు. స్టార్ విలన్ గా ఆయన అందుకుంటున్న పారితోషికం కూడా, హీరోగా ఆయన తీసుకున్న పారితోషికానికి ఎక్కువే కావడం విశేషం.
ఇతరులకు సాయం చేసే మంచి మనసు వల్లనే ఆయన కెరియర్ గ్రాఫ్ మళ్లీ పెరగడానికి కారణమనే వాళ్లు చాలామందే ఉన్నారు. ఈ రోజున ఆయన 60వ పుట్టినరోజు. తనని ఇంతకాలంగా .. ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా ఆయన థ్యాంక్స్ చెప్పారు.