సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్ నటనకు ఆస్కారం ఉన్న పాత్రను చేశాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్శకుడు దేవా కట్టా స్క్రిప్ట్ విషయంలో చాలా వర్క్ చేసి రాజీ లేకుండా తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యిందని.. ఓటీటీ నుండి పెద్ద ఎత్తున ఆఫర్లు ఈ సినిమాకు వస్తున్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది.
ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ కి సాలిడ్ రేటుకు అమ్మేశారు అని కూడా ఆ మద్య పుకార్లు షికార్లు చేశాయి. కాని ఆ వార్తలు పుకార్లు అంటూ యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. పెద్ద ఎత్తున అంచనాలున్న రిపబ్లిక్ సినిమా గానా ఆఫ్ రిపబ్లిక్ మ్యూజికల్ నైట్ కార్యక్రమంను సంగీత దర్శకుడు మణిశర్మ పుట్టిన రోజు సందర్బంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా రిపబ్లిక్ చిత్రంపై చాలా నమ్మకంగా కనిపించారు. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల ను కొట్టి పారేశారు.
ముఖ్యంగా ఈ సినిమా విడుదల గురించి సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. సినిమా ను ఖచ్చితంగా మొదట థియేటర్లలోనే విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చాడు. థియేటర్లలో వచ్చిన తర్వాతే ఎక్కడైనా వస్తుందని.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి రిపబ్లిక్ ను చూసి ఎంజాయ్ చేయాలని ఆయన కోరుకున్నాడు. చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు పెద్ద ఎత్తున తరలి రావాలి.. మునుపటి మాదిరిగా తెలుగు సినిమాను ఆధరించాలని కోరుకుంటున్నట్లుగా మాట్లాడారు. రిపబ్లిక్ సినిమా ఓటీటీ రిలీజ్ పుకార్లు ఇంతటితో అయినా ముగుస్తాయా చూడాలి. థియేటర్లు మెల్ల మెల్లగా ఓపెన్ అవుతున్న ఈ నేపథ్యంలో రిపబ్లిక్ ను ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.