తన ఫ్లాప్‌ లకు కారణం వెతుక్కున్న కుర్ర హీరో

Update: 2019-10-19 17:10 GMT
యంగ్‌ హీరో ఆది ఇటీవల 'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన గత చిత్రాల మాదిరిగా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేక పోతుందనే టాక్‌ వస్తోంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఫైనల్‌ రిజల్ట్‌ ఏంటో వేచి చూడాలి. ఇక ఆది హీరోగా ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఆది కమర్షియల్‌ హీరోగా బ్రేక్‌ తెచ్చుకోలేక పోయాడు. కెరీర్‌ లో కొన్ని సక్సెస్‌ లు వచ్చినా ఎక్కువగా ఆది పరాజయాలనే చవిచూశాడు.

ఆది తన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్‌ అవ్వడానికి గత కారణాన్ని విశ్లేషించుకున్నాడట. ఎలాంటి కథను అయినా కమర్షియల్‌ గా ఉండేలా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ స్క్రీన్‌ ప్లేతో చేస్తున్నాడట. మంచి కథలను ఎంపిక చేసుకున్నా వాటిని కమర్షియల్‌ గా రూపొందిస్తున్న కారణంగా ఎక్కువ శాతం ఫ్లాప్‌ లు వస్తున్నాయని ఆయన భావిస్తున్నాడట.

కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ కథలను ఎంపిక చేసుకున్నప్పుడు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తో కాకుండా సీరియస్‌ గా స్క్రీన్‌ ప్లేను నడిపించినట్లయితేనే సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తుందని.. కాని కమర్షియల్‌ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఆ స్క్రిప్ట్‌ ను మార్చడం వల్లే ఫలితాలు తారుమారు అయ్యాయని ఆది అభిప్రాయ పడుతున్నాడట. ఆది తన సినిమాల ఫ్లాప్‌ కు కారణాలు వెతుక్కోవడం మంచిదని.. దీంతో ఇకపై అయినా ఆది మంచి చిత్రాలు చేస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News