బొద్దుగుమ్మలు `జీరో సైజ్` లుక్ తో కనిపిస్తేనే ప్రేక్షకాదరణ దక్కుతుందా? యువతరానికి నచ్చాలంటే సైజ్ జీరోకి మారాల్సిందేనా? అంటే అవునని అనలేం.. కాదని అనలేం. ముంబై నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు జీరో సైజ్ లో మెరుపుతీగల్లా మెరిసిపోతుంటారు. కానీ సౌత్ భామలు బొద్దుతనం తగ్గించుకుంటే ఎందుకనో చాలా సందర్భాల్లో సరిగా కనెక్టవ్వరు.
ఇంతకుముందు శ్రీరామరాజ్యం సినిమా కోసం బొద్దుగా ఉన్న నయనతార స్లిమ్ లుక్ కి మారగానే ఒక సెక్షన్ ఆడియెన్ కి నచ్చలేదు. సింహా .. శ్రీరామరాజ్యం చిత్రాల్లో నయన్ అందంగా ఉన్నా కానీ సన్నజాజి అయిపోవడం తనకు సూట్ కాలేదని ఒక సెక్షన్ అభిమానులు నిరాశపడ్డారు. అలాగే ఓ బాలీవుడ్ మూవీ కోసం కీర్తి సురేష్ జీరో సైజ్ ట్రై చేశారు. మరో మూవీ `మిస్ ఇండియా`లో అదే లుక్ తో కనిపిస్తారని టాక్ ఉంది. కానీ మారిన లుక్ తన అభిమానులకు కనెక్టవ్వలేదు. ఇటీవల పీలగా కనిపించేసరికి విమర్శలొచ్చాయి. దాంతో తిరిగి బొద్దుగా మారేందుకు ప్రయత్నించింది. నితిన్ రంగ్ దే చిత్రంలో ఫర్వాలేదనిపించింది.
అయితే నయన్ .. కీర్తిలకు భిన్నంగా గోవా బ్యూటీ ఇలియానా ఇటీవల జిమ్ చేసి మెరుపుతీగలా మారిపోతే మాత్రం అందరికీ బాగా కనెక్టయిపోయింది. అది తన సోగ దేహానికి అస్సెట్ అయ్యింది. అలాగే దిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా జిమ్ చేసి వెయిట్ తగ్గాక మరింత మెరుపులా కనిపిస్తోంది.
ఇటీవల మల్లూ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సైజ్ జీరో కోసం ట్రై చేస్తోందని సమాచారం. కానీ తన లుక్ సౌత్ ఆడియెన్ కి కనెక్టవుతుందా? అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కీర్తి సురేష్ లా పీలగా(బక్కగా) మారిపోతుందేమో..! అన్న డౌట్ వ్యక్తమైంది. అయితే సైజ్ జీరో కి వచ్చినా కొందరిలో గ్లో ఎలిమెంట్ తగ్గదు. దానిని అనుపమ మెయింటెయిన్ చేసిందా లేదా? అన్నది తెరపైనే చూడాలి. ఈ భామ ప్రస్తుతం దిల్ రాజు తమ్ముడు కుమారునితో ఓ సినిమా చేస్తోంది. దిల్ రాజు బ్యానర్ లోనే నిఖిల్ తో మరో సినిమా చేస్తోంది. అనుపమ బబ్లీ లుక్ పై ఎప్పుడూ విమర్శల్లేవ్. కానీ జీరో సైజ్ ఎందుకని ట్రై చేస్తోంది? అయినా సౌత్ లో బొద్దుగా ఉన్నా ఆదరణ దక్కుతున్నప్పుడు స్లిమ్ అవ్వాలన్న ఆలోచన దేనికి? పాత్ర డిమాండ్ చేస్తే తప్ప!!