పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ విజువల్ వండర్ మూవీ 'రాధేశ్యామ్'. విధికి ప్రేమకు మధ్య సాగే సమరం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో మార్చి 11న ప్రపసంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. 'సాహో' తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడం. దాదాపు మూడేళ్ల విరామం తరువాత ప్రభాస్ సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూడాలా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్ల లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వరుస ప్రమోషన్స్ తో హోరెత్తిస్తున్నారు. ముంబైలో రిలీజ్ ట్రైలర్ తో ప్రమోషన్స్ ని జోరుగా ప్రారంభించారు. పూజా హెగ్డే ప్రామోషన్స్ లో పాల్గొనే అవకాశం లేదని ముందు ప్రచారం జరిగినా ఆ ప్రచారాన్ని తిప్పి కొడుతూ పూజా హెగ్డే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నుంచి 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ షాకిస్తోంది.
ప్రభాస్ కూడా అదే జోష్ తో ఈ మూవీ ప్రమోషన్స్ ని స్పీడప్ చేసేశాడు. ఇదిలా వుంటే చిత్ర బృందం బుధవారం రాధేశ్యామ్ కు సంబంధించిన కొత్త వీడియోని విడుదల చేసింది. 'ది జర్నీ ఆఫ్ రాధేశ్యామ్ ప్రమోషన్స్' అంటూ మేకర్స్ కొత్త వీడియోని విడుదల చేశారు. ఈ మూవీ జర్నీ ఎప్పుడు మొదలైందో తెలియజేస్తూ మొత్తానికి ఫైనల్ డెస్టినేషన్ కి వచ్చేసిందని తాజా వీడియోలో స్పష్టం చేశారు. 2019లో ఈ మూవీ జర్నీ మొదలైంది. కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది.
ఆ తరువాత కూడా కరోనా కారణంగా రిలీజ్ డేట్ లు మారుతూ వచ్చాయి. ఫనల్ గా మార్చి 11న రిలీజ్ డేట్ లాక్ కావడం.. మొత్తానికి 'రాధేశ్యామ్' ఫైనల్ డెస్టినేషన్ స్టేజ్ కి చేరుకోవడం వంటి విషయాల్ని ఈ వీడియోలో ప్రస్తావించారు. ట్రైన్ కి సిబ్బంది పోస్టర్స్ ని అంటించి దేశ వ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించడం.. లోకల్ ట్రైన్స్, మెట్రో ట్రైన్స్ ని కూడా 'రాధేశ్యామ్' పోస్టర్లతో నింపేయడం.. మొత్తానికి సినిమా మీ హృదయాల్ని చేరుకోవడానికి సిద్ధమైందంటూ హింట్ ఇచ్చారు.
అంతే కాకుండా ఈ వీడియోలో బిగ్గెస్ట్ వార్ కి సాక్షులుగా నిలవడానికి మాతే చేరండి అంటూ టీమ్ ఆహ్వానించడం ఆకట్టుకుంటోంది.
ప్రేమకు, విధికి మధ్య సాగిన సమరం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రభాస్ కు మరో మర్చిపోలేని విజయాన్ని అందిస్తుందని అభిమానులు, మేకర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఈ మూవీతో ఓ భారీ రిస్క్‌ని చేశానని చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. నిడివి మరీ ఎక్కువ కావడంతో 12 నిమిషాల పాటు సాగే సన్నివేశాలని సినిమా నుంచి తొలగించారని చెబుతున్నారు. సినిమా మొత్తం రన్ టైమ్ 150 నిమిషాలని తెలిసింది.
Full View