రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'లైగర్'. బ్యాన్ చేసిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ MMA నేపథ్యంలో లవ్ స్టోరీని జోడించి వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అ మూవీని తెరకెక్కించారు. బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ మూవీ ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా తెలుగు, హిందీ భాషలతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా విడుదలైంది. వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటించడంతో ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆగస్టు 25న గురువారం భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్‌ని, సగటు సినీ లవర్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ ఎఫర్ట్ కనిపించిందే కానీ ఏ విషయంలోనూ దర్శకుడు పూరి జగన్నాథ్ ఎఫర్ట్ కనిపించలేదు. ఆయన మార్కు సినిమాగా లేదని ప్రేక్షకుల పెదవి విరుస్తున్నారు. నెట్టింట దర్శకుడు విఫలం కావడం వల్లే సినిమాకు ఇలాంటి ఫలితం లభించిందంటూ నెట్టింట డైరెక్టర్ ని, ఛార్మీని ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ల కలయిలో రూపొందుతున్న సినిమా పరిస్థితి ఏంటన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. 'లైగర్' అండర్ ప్రొడక్షన్ లో వుండగానే పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' మూవీని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ మూవీని పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ లపై ఛార్మీ, దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మిస్తున్నాను. ఇప్పటి వరకు పూరి కనెక్ట్స్ పై ఆకాష్ పూరితో నిర్మించిన మెహబూబా, రొమాంటిక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ లుగా నిలిచాయి.
ఇస్మార్ట్ శంకర్ మినహా ఇప్పడు 'లైగర్' కూడా అదే బాట పట్టడంతో విజయ్ - పూరిల 'జనగణమన' పరిస్థితేంటని ఇప్పడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 'జనగణమన' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తున్న పూరి జగన్నాథ్ ముందు ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. మహేష్ కూడా ఆసక్తిని చూపించాడు. అయితే తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి మహేష్ తప్పుకోవడం తెలిసిందే.
ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ ని ఎవరితో చేయాలా? అని ఆలోచిస్తున్న పూరి జగన్నాథ్ ఫైనల్ గా విజయ్ దేవరకొండతో స్టార్ట్ చేశాడు. 'లైగర్' పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటీ? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.