సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరియు డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం ''లైగర్''. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది దీనికి ట్యాగ్ లైన్. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే 'లైగర్' సినిమా నుండి వచ్చిన పమోషనల్ కంటెంట్ కు విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకుని, మేకర్స్ కొద్దిసేపటి క్రితం లైగర్ హంట్ థీమ్ లిరికల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
''ఇవాళ మా #లైగర్ జన్మించాడు. అతను అడవికి రాజుగా ఉండటానికి వేటగాడుగా జన్మించాడు. ఈరోజు హంట్ థీమ్ తో మా పాన్ ఇండియన్ వేటను ప్రారంభిస్తాము'' అని చిత్ర బృందం పేర్కొంది. ఈ స్పెషల్ థీమ్ సాంగ్ సినిమాలో హీరో క్యారక్టర్ మరియు అతని యాటిట్యూడ్ ని ప్రెజెంట్ చేస్తోంది.
విజయ్ దేవరకొండ యొక్క అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ - ఇంటెన్స్ లుక్ మరియు అతని పోరాట పటిమను ఈ 'లైగర్ హంట్' థీమ్ సాంగ్ లో చూపించారు. స్లమ్ డాగ్ ఆఫ్ ముంబై స్ట్రీట్స్ నుండి.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ లో ఛాంపియన్ గా నిలిచే వరకు స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని వివరిస్తుంది.
విక్రమ్ మాంట్రోస్ ఈ థీమ్ సాంగ్ కు ట్యూన్ కంపోజ్ చేయగా.. హేమచంద్ర తనదైన శైలిలో ఆలపించారు. 'నువ్వు పుట్టిందే గెలిచేటందుకు.. దునియా చమడాలు ఒలిచేటందుకు.. అది గుర్తుంటే ఇంకేం చూడకు.. ఎవడూ మిగలడు ఎదురు పడేందుకు' అంటూ గీత రచయిత భాస్కర భట్ల స్ఫూర్తిదాయకమైన సాహిత్యం అందించారు.
ఇకపోతే ఈ సందర్భంగా 'లైగర్' నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. ఇది బౌట్ లో విజయ్ దేవరకొండ తన ప్రత్యర్థిపై పవర్ ఫుల్ అప్పర్ కట్ ను విసరడాన్ని సూచిస్తుంది. ఇందులో వీడీ ప్రొఫెషనల్ బాక్సర్ గా కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శిస్తున్నాడు. అతని మేకోవర్ నిజంగా అపురూపంగా ఉంది.
'లైగర్' అనేది విజయ్ మరియు పూరీ జగన్నాథ్ లకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రోనీత్ రాయ్ - ఆలీ - విషు రెడ్డి - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శీను తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ - అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించగా.. జానీ షేక్ బాషా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. థాయ్ లాండ్ కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు
Full View

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ''లైగర్'' సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.