300కోట్లు దోచుకెళ్లే ల‌య‌న్ కింగ్

Update: 2018-11-23 05:21 GMT
అన‌గ‌న‌గ‌న ఒక అడివి. ఆ అడ‌వికి మృగ‌రాజు సింహం. అడ‌విలోని జంతువుల‌న్నీ రాజు చెప్పిన‌ట్టే వినాలి. రోజుకో జంతువు ప్ర‌తిరోజూ త‌న‌కు తానుగా సింహానికి ఆహారం అవ్వాలి. అదీ రూల్.  ఈ రూల్‌ ని బ్రేక్ చేస్తే మృగ‌రాజు ఊరుకుంటాడా?  పైగా మ్యాన్ క‌బ్ (పిల్లాడు) అడ‌విలో ప్ర‌వేశించి మృగ‌రాజుకు వ్య‌తిరేకంగా గుంపును త‌యారు చేస్తే - ఆ గుంపును లీడ్ చేస్తే.. రాజుగారి అహం దెబ్బ తిన‌దూ?  స‌రిగ్గా ఇదే పాయింట్‌తో జంగిల్ బుక్ సినిమా తీసి ఇండియా నుంచి 300కోట్లు దోచుకెళ్లారు. హాలీవుడ్ వాళ్ల‌కు చేత‌నైన‌ది.. మ‌న‌వాళ్ల‌కు చేత‌కానిది! అంటూ చెప్పుకోవాల్సి వ‌చ్చింది.

క్రియేటివిటీకి అంతూ ద‌రీ లేదు. ప్ర‌పంచం బుల్లిపెట్టె(సెల్‌ ఫోన్)లోకి దూరిపోయిన వేళ క్రియేటివిటీ ఉంటే కాసులే కాసులు. యానిమేష‌న్ - 3డి విజువ‌ల్స్‌ తో కోట్ల‌కు కోట్లు ఆర్జిస్తున్నారు. 2017లో రిలీజైన `జంగిల్ బుక్` క‌థ అమ‌ర‌చిత్ర‌క‌థల స్ఫూర్తితోనే తెర‌కెక్కిన‌ది. అడ‌విలో జంతువుల‌కు భాష ఉంటే - అవి తెలుగులో మాట్లాడుకుంటే - ఆ అంద‌మైన విజువ‌ల్స్‌ ని మ‌న‌వాళ్లు వీక్షిస్తే కోట్లు కురుస్తాయ‌ని నిరూప‌ణ అయ్యింది. ఇండియా వ్యాప్తంగా రిలీజైన జంగిల్ బుక్ చిత్రం దాదాపు 300కోట్లు వ‌సూళ్ల‌ను ఎత్తుకెళ్లింద‌ని ట్రేడ్ నిపుణులు చెప్పారు.

ఈ ధ‌న‌దాహం హాలీవుడ్ వాళ్ల‌కు ఇంకా ఇంకా పెరుగుతోందే కానీ - త‌గ్గ‌డం లేదు. ఇండియా నుంచి ఎంత దోస్తే అంత మొన‌గాళ్లుగా ఫీల‌వుతున్నారు. అందుకే ఇప్పుడు`ది జంగిల్ బుక్` సీక్వెల్ `మోగ్లీ` తీస్తున్నారు. ఇదివ‌ర‌కూ మోగ్లీ టీజర్ రిలీజై సంచ‌ల‌న వ్యూస్‌ తో యూట్యూబ్‌ లో దూసుకెళ్లింది. ఈ చిత్రాన్ని వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈనెల 29న `మోగ్లీ- ది లెజెండ్ ఆఫ్ జంగిల్‌` చిత్రం రిలీజ‌వుతోంది. అయితే తాజాగా ఈ సిరీస్‌ కి పోటీ సిరీస్‌ ని డిస్నీ ఫ్రాంఛైజీ తెర‌పైకి తెవ‌డం హీటెక్కిస్తోంది. తాజాగా రేసులోకి వ‌చ్చింది `ది ల‌య‌న్ కింగ్`. ఈ సిరీస్‌ లో తొలి సినిమా 2018 స‌మ్మ‌ర్‌ లో దూసుకొస్తోంది. అడ‌వికి రారాజు సింహం. ఆ సింహానికి వార‌సుడిని ప్ర‌క‌టించే ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాన్ని తాజాగా రిలీజ్ చేసిన టీజ‌ర్‌ లో మ‌హ‌దాద్భుతంగా ఆవిష్క‌రించారు. `మోగ్లీ` చిత్రానికి ఆండీ సెర్కిస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంటే, `ది ల‌య‌న్ కింగ్` చిత్రానికి `ది జంగిల్ బుక్` ఫేం జాన్ ఫ‌వ్‌ రూవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ది ల‌య‌న్ కింగ్ ఈ వేస‌విలో ఇండియా నుంచి 300కోట్లు దోచుకెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. టీజ‌ర్ అంత ప్రామిస్సింగ్‌ గా ఉంది. పైగా ఈ టీజ‌ర్ చూస్తుంటే థ‌మ‌న్ రీరికార్డింగ్‌ తో ఓ తెలుగు సినిమాని చూసినంత నేటివిటీ ట‌చ్‌ తో చాలా స‌ర‌ళంగా ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News