మనసు మీద ఘాడమైన ముద్ర వేసేవి ప్రధానంగా రెండు. ఒకటి విజువలైజేషన్.. రెండోది సౌండింగ్. ఈ రెండిటిపై కమాండ్ ఉంటే విజువల్ మాయాజాలంతో ఆడియెన్ ని కుర్చీ అంచుకు కట్టేయొచ్చు అని నిరూపించారు ప్రముఖ దర్శకులు. ఇక మాయలు మర్మాలు మ్యాజిక్కులు గిమ్మిక్కులు లార్జర్ దేన్ లైఫ్ పాత్రలు అంటూ `లార్డ్ ఆఫ్ ది రింగ్స్`లో అసాధారణ ట్విస్టులతో కథలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ నచ్చుతాయి. ఆస్కార్ లు కొల్లగొట్టిన సిరీస్ ఇది. ఇందులో తాజా చివరి సినిమా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగుకి రెడీ అవుతోంది.
`ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఫైనల్` ట్రైలర్ సిరీస్ ప్రీమియర్ కు ముందు విడుదలైంది. ఆఖరి ట్రైలర్ లో గాలాడ్రియల్ (మోర్ఫిడ్ క్లార్క్) మిడిల్ ఎర్త్ లో చెడు పెరుగుదల గురించి ప్రస్థావించాడు. అతడు ఇలా అంటాడు.. భయం అనే మార్గాన్ని కాదు.. విశ్వాసం యొక్క మార్గాన్ని ఎంచుకోండి..! అని అంటాడు. 2నిమిషాల 36-సెకన్ల ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టించే విజువలైజేషన్ సౌండింగ్ తో అదరగొడుతుంది.
రెండవ యుగంలో మధ్య-భూమి (మిడిల్ ఎర్త్.. మంచు దుప్పటితో మైనస్ డిగ్రీల చలిలో) నాటి కాలాన్ని హైలైట్ చేస్తుంది. టోల్కీన్ పురాణాల నాటి అందమైన పాత్రల ప్రయాణం కథ ఇది. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా చాలా దూరం ప్రయాణించి భయంకరమైన పునరుజ్జీవనానికి చెడుకి వ్యతిరేకంగా ఎలా కలిసి వస్తాయో వెల్లడిస్తుంది.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త సిరీస్ కి సంబంధించిన ఈ ఫుటేజ్ ప్రకారం ఎదురు దాడికి వస్తున్న చెడు నేపథ్యంలో ఫేట్స్ ఢీకొంటాయని.. భిన్నమైన పాత్రలు పరీక్షలను ఎదుర్కొంటాయని ట్రైలర్ విశదపరుస్తోంది. ఈ ట్రైలర్ లో ఘాడతతో కూడుకున్న సంభాషణలు మనసు పై అంతే ముద్రను వేస్తున్నాయి. ఓటీటీ వీక్షకులకు ఇది విజువల్ ఫీస్ట్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
ట్రైలర్ లో ముఖ్య తారాగణం వివరాలు పరిశీలిస్తే... గాలాడ్రియల్ (మోర్ఫిడ్ క్లార్క్), .. ఎల్రోండ్ (రాబర్ట్ అరమాయో), .. హై కింగ్ గిల్-గాలాడ్ (బెంజమిన్ వాకర్) .. సెలెబ్రింబోర్ (చార్లెస్ ఎడ్వర్డ్స్)... హార్ ఫూట్స్ ఎలనోర్ (నోరి.. బ్రాండీ ఫూట్ (మార్కెల్ల కెవెనాజ్) .. లార్గో బ్రాండీ ఫుట్ (డైలాన్ స్మిత్);... ది స్ట్రేంజర్ (డేనియల్ వేమాన్);.. న్యూమెనోరియన్స్ ఇసిల్దుర్ (మాగ్జిమ్ బాల్డ్రీ),.. ఎరియన్ (ఎమా హోర్వత్),.. ఎలెండిల్ (లాయిడ్ ఓవెన్),.. ఫారాజోన్ (ట్రిస్టన్ గ్రావెల్లే), .. క్వీన్ రీజెంట్ మిరియెల్ (సింథియా అడ్డై-రాబిన్సన్);.. డ్వార్వ్స్ కింగ్ డురిన్ III (పీటర్ ముల్లన్), ప్రిన్స్ డురిన్ IV (ఓవైన్ ఆర్థర్),.. ప్రిన్సెస్ దిసా (సోఫియా నోమ్వెటే);.. సౌత్‌ల్యాండర్స్ హాల్‌బ్రాండ్ (చార్లీ వికర్స్);.. బ్రోన్విన్ (నజానిన్ బోనియాడి);.. సిల్వాన్-ఎల్ఫ్ అరోండిర్ (ఇస్మాయిల్ క్రుజ్ కోర్డోవా) తదితర పాత్రలు అలరించనున్నాయి.
Full View