టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా జపం చేస్తున్న నేపథ్యంలో.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయని హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కరే అని చెప్పాలి. తనకు తెలుగులో సినిమాలు చేయడమే కంఫర్ట్ అని.. దృష్టంతా తెలుగు చిత్రాలపైనే ఉందని చెబుతూ వచ్చిన మహేష్.. ఆ సినిమాలు అన్ని భాషల వారికి రీచ్ అయితే హ్యాపీ అని పేర్కొన్నారు.
ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసిన 'సర్కారు వారి పాట' చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. పరశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేయడానికి ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ కూడా రెడీ అయ్యారని అనుకున్నారు.
అయితే మహేశ్ నిర్ణయంతోనే మేకర్స్ వెనక్కి తగ్గారని.. దీని వెనుక సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్ వేరే ఉందని టాక్ వినిపిస్తోంది. 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ సినిమా ఉంటుంది. అది కచ్చితంగా భారీ బడ్జెట్ తో రూపొందే పాన్ ఇండియా చిత్రం అవుతుంది.
జక్కన్నతో తాను చేయబోయే సినిమా పాన్ ఇండియా కాక ఇంకేమవుతుందని మహేశ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 'ఆర్.ఆర్.ఆర్' మేకర్ తో తన సినిమా ఆలస్యం అయినప్పటికీ.. రిజల్ట్ గురించి అభిమానులు ఖచ్చితంగా సంతోషిస్తారని స్పష్టం చేశారు. స్టార్ హీరో వ్యాఖ్యలను బట్టి రాజమౌళి చిత్రంతోనే పాన్ ఇండియాను టార్గెట్ చేయాలని ఫిక్స్ అయినట్లు అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో SVP ని హిందీలో రిలీజ్ చేయనీయలేదని టాక్.
'సర్కారు వారి పాట' సినిమాతో కొంచెం తక్కువ స్కోర్ చేస్తే.. అది మహేష్ కు హిందీ రంగంలోకి సరైన ఎంట్రీ అనిపించుకోదు. అంతేకాదు అది తదుపరి చిత్రాల మార్కెట్ పై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. అదే రాజమౌళి సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెడితే.. ఒక్కసారిగా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చి పడుతుంది. నెక్స్ట్ సినిమా మార్కెట్ కూడా దాని ప్రకారమే ఉంటుంది.
ఇవన్నీ ఆలోచించి మహేష్ బాబు సర్కారు వారి నిర్మాతల హిందీ రిలీజ్ ప్లాన్ నుండి డ్రాప్ చేసారని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మహేశ్ నిర్ణయం సరైనదనే అనుకోవాలి. ప్రభాస్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ మాదిరిగానే మహేశ్ బాబుకు కూడా రాజమౌళి చిత్రంతోనే పాన్ ఇండియా స్టార్ గా అవతరించే అవకాశం ఉంటుంది.
ఇకపోతే బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇటీవల మహేశ్ బాబు చేసిన కామెంట్స్ అంతటా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుంచి తనకెన్నో ఆఫర్స్ వచ్చాయని.. కానీ వాళ్లు తనను భరించలేరనుకుంటున్నానని.. అందుకే అక్కడికి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదని మహేష్ అన్నారు.
టాలీవుడ్ లో తనకు లభిస్తోన్న ప్రేమాభిమానాలు అమితమైనవని.. వాటిని వదిలి వేరే ఇండస్ట్రీకి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇక్కడే సినిమాలు చేయాలని.. అవి దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని అలరిస్తే చూడాలనుకుంటున్నానని.. ఎందుకంటే తెలుగు సినిమాలే తన బలమని మహేశ్ వివరించారు.
అయితే మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలను బీటౌన్ ప్రేక్షకులు తప్పుబట్టారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై సూపర్ స్టార్ టీమ్ స్పందించింది. మహేశ్ చెప్పిన మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. మహేష్ కు అన్ని భాషలు - అన్ని సినిమాలపై అమితమైన గౌరవం ఉందని.. ఆయనకు అన్ని భాషలూ సమానమేనని స్పష్టం చేశారు.
ఎన్నో ఏళ్ల నుంచి తెలుగులోనే సినిమాలు చేయడం వల్ల మిగతా పరిశ్రమలతో పోలిస్తే తాను ఇక్కడ సౌకర్యవంతంగా ఫీలవుతున్నానని మాత్రమే మహేశ్ చెప్పారని క్లారిటీ ఇచ్చారు. రాజమౌళితో చేయనున్న తన తదుపరి చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుందని మహేశ్ బాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.