క్రేజీ సీజ‌న్ ల‌ని క‌బ్జా చేసేసిన మెగాస్టార్‌

Update: 2022-04-02 02:30 GMT
మెగాస్టార్ చిరంజీవి మునుపెన్న‌డూ లేని విధంగా సినిమాల విష‌యంలో స్పీడు పెంచేశారు. గ‌తంలో ఏడాదికి ఒక చిత్రం మాత్ర‌మే చేసిన మెగాస్టార్ ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అంగీక‌రిస్తూ స్టార్ హీరోల‌కు షాకిచ్చారు. చిరు జోరు చూసిన హీరోలంతా మేము సైతం అంటూ స్పీడు పెంచేశారు. చిరు దాదాపు ఐదు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వుంటే స్టార్ హీరోలు కూడా రెండు నుంచి నాలుగు చిత్రాల‌తో బిజీగా మారిపోయారు.

ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్ర‌భాస్ , మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, ర‌వితేజ‌, నాని.. ఇలా ప్ర‌తీ హీరో వ‌రుస చిత్రాల‌ని లైన్ లో పెట్టేసి షాకిస్తున్నారు. ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి ఐదు చిత్రాల‌తో మూడు సీజ‌న్ ల‌ని క‌బ్జా చేసేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న 'ఆచార్య‌' చిత్రంతో ఈ నెలాఖ‌రుని ప్రేక్ష‌కుల ముందుకు రానున్న చిరంజీవి మూడు సీజ‌న్ ల‌కు మూడు చిత్రాల‌ని ట్రాక్ లో  పెట్టేశారు.

ఈ ఏడా ఏప్రిల్ నుంచి 2023 జ‌న‌వ‌రి వ‌ర‌కు వున్న కీల‌క సీజ‌న్ ల‌లో మెగాస్టార్ న‌టిస్తున్న మూడు క్రేజీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి చిరంజీవి న‌టించిన చిత్రం 'ఆచార్య‌'. కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో నిరంజ‌న్ రెడ్డి అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్ లుగా న‌టించిన ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుక‌గా ఏర్పిల్ 28న రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక ఇదే ఏడాది ద‌స‌రాకు మ‌రో సినిమా రాబోతోంది. అదే 'భోళా శంక‌ర్‌'. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ 'వేదాలం' ఆధారంగా ఈ చిత్రాన్ని మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కిస్తున్నారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. హీరోయిన్ గా త‌మ‌న్నా క‌నిపించ‌నుంది. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని ద‌స‌రాకు విడుద‌ల చేస్తున్నార‌ట‌.

ఇక ఇదే ఊపులో మ‌రో రీమేక్ సినిమాతో వ‌చ్చే ఏడాది సంక్రాంతిని క‌బ్జా చేశాడు చిరు. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం 'లూసీఫ‌ర్‌' ఆధారంగా చిరుతో 'గాడ్ ఫాద‌ర్‌' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని మోహ‌న్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు.

స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క అతిథి పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ముంబైలో జ‌రిగిన షెడ్యూల్ లో స‌ల్మాన్ ఖాన్ అతిథి పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేశారు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇలా వ‌రుస‌గా మూడు సీజ‌న్ ల‌ని మూడు చిత్రాల‌తో చిరు క‌బ్జా చేసుకోవ‌డం విశేషం.
Tags:    

Similar News