బాలీవుడ్ లో మరో కొత్త ప్రేమ జంట చెక్కర్లు కొడుతుంది. యువ హీరో.. హీరోయిన్ గా ఎంట్రీ ఇద్దామనుకుంటున్న ఒక స్టార్ హీరో కజిన్ డాటర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వాళ్లిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ కాదు మరేదో అంటూ ముంబై మీడియా హడావిడి చేయడం మొదలు పెట్టింది. ఇంతకీ ఎవరా కొత్తజంట అంటే బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, పష్మినా రోషన్. హృతిక్ రోషన్ కజిన్ రాజేష్ రోషన్ డాటర్ అయిన పష్మినా రోషన్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. తెరంగేట్రం చేయక ముందే అమ్మడు కార్తీక్ ఆర్యన్ కి క్లోజ్ అయ్యింది.
బాలీవుడ్ ఈవెంట్స్ లో ఎక్కడ చూసినా వీరిద్దరు కలిసి ఉంటున్నారు. అంతేకాదు దీవాళి నైట్ కూడా కార్తీక్, పష్మినా కలిసి రాత్రంగా ఉన్నారట. వీరిద్దరి మధ్య ఉన్నది ఫ్రెడ్ షిప్పే అంటూ కొందరు గట్టిగా చెబుతున్నారు. కానీ వీళ్ల వ్యవహారం చూస్తే ఫ్రెండ్ షిప్ రేంజ్ దాటి సంథింగ్ సంథింగ్ అనిపించేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ మీద ఇదివరకు సారా అలి ఖాన్, అనన్యా పాండేలతో కూడా రిలేషన్ ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ అవి కేవలం గాలి వార్తలని తేలింది. ఆ హీరోయిన్స్ ఇద్దరు కార్తీక్ పై తమ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చారు.
అందుకే కార్తీక్ ఇప్పుడు పష్మినాకి క్లోజ్ గా ఉంటున్నాడని అంటున్నారు. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే పష్మినా రోషన్ వార్తల్లో నిలుస్తుంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న కథానాయిక కాబట్టి తెరంగేట్రం గ్రాండ్ గానే ఉండబోతుంది. అయితే హీరోయిన్ గా కొన్నాళ్లు కెరియర్ సాగించాలని అనుకుంటే మాత్రం ఇలాంటి డేటింగ్ లు గట్రా ఆపేస్తే బెటర్. లేదంటే ఆమె కెరియర్ కు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
కార్తీక్, పష్మినా ల మధ్య లవ్ స్టోరీ అంటూ వస్తున్న వార్తలపై వాళ్లిద్దరు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం ఫ్రెడ్డీ సినిమాతో వస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్ బీ టౌన్ ఆడియన్స్ ని మెప్పించింది. అయితే సినిమాల కన్నా అతని డేటింగ్ విషయాలతో ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. బాలీవుడ్ యువ హీరోగా వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తున్న కార్తీక్ ఆర్యన్ సినిమలతో పాటుగా లవ్ స్టోరీస్ తో కూడా రెగ్యులర్ గా హెడ్ లైన్స్ లో ఉంటున్నాడు. ఈ హీరో సినిమాలతో పాటుగా ఇలాంటి వాటి మీద కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు ఉన్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.