కొన్నిటికి గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఉన్న ఏకైక టాలీవుడ్ సీనియర్ హీరోగా ఆయన పేరు మార్మోగుతోంది. అసలు ఊపిరాడనివ్వని ఇంతటి కల్లోలంలో ఆయన మాత్రం 60 ప్లస్ ఏజ్ లో అస్సలు దేనికీ భయపడక వరుసగా సినిమాల షూటింగులకు ప్లాన్ చేస్తున్నారు. పైగా స్వదేశంలోనే కాదు విదేశాలకు వెళతారట.
చూస్తుంటే ఆయన గట్స్ ని కొనియాడకుండా ఉండలేం. అసలే కోవిడ్ దెబ్బకు 30లోపు వాళ్లే ఒణుకుతుంటే.. ఆయన ఈ 60 ప్లస్ ఏజ్ లో సాహసాలే చేస్తున్నారు. ఇంతకుముందు మొదటి వేవ్ లోనూ ఇలాగే చేశారు. ఇంతకీ ఎవరాయన? అంటే .. ఇంకెవరు.. ది గ్రేట్ కింగ్.. అక్కినేని నాగార్జున.
మొదటి వేవ్ లో వైల్డ్ డాగ్ షూటింగులో పాల్గొన్న నాగార్జున ఇప్పుడు ప్రవీణ్ సత్తారు సినిమా కోసం విదేశాలకు వెళుతున్నారట. జూన్ రెండో వారంలోనే షూటింగ్ అని తెలిసి నిశ్చేష్ఠులవుతున్నారంతా.
దేశంలో రోజువారీ కేసులు 3 లక్షలకు పైగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సన్నివేశం ప్రమాదకరంగానే ఉంది. కానీ నాగార్జున తన చిత్రం షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం రెండు వారాలలోనే షూట్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ గత వారం ఫిబ్రవరిలో ప్రారంభమై హైదరాబాద్ - గోవాలో పూర్తి చేసేశారు. రెండవ షెడ్యూల్ ను మొదలెట్టేస్తున్నారు.
ఏదేమైనా నాగార్జున భారీ రిస్క్ తీసుకుంటున్నారు. భారీ సిబ్బంది నడుమ ఆయన షాట్ లో పాల్గొనడం చాలా రిస్కీ. అసలే కోవిడ్ గాల్లో ఎక్కువ సమయం ఉంటుందన్న నివేదిక అంతే దడ పుట్టిస్తోంది. అందుకే ఇంత వేగంగా ఈ వైరస్ సోకుతోందన్న రిపోర్టులు ఉన్నాయి. కానీ కింగ్ ఇలాంటి సాహసం చేయడం సరైనదేనా అన్నది పునరాలోచించుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. రాజశేఖర్ తో గరుడ వేగ తెరకక్కించి బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రవీణ్ సత్తారు నాగార్జునను పవర్ ఫుల్ గా చూపిస్తున్నారు. లెవంథ్ అవర్ వెబ్ సిరీస్ తోనూ ఆయన పేరు తెచ్చుకున్నారు.