మ‌లైకా- ఆర్భాజ్ విడిపోవ‌డానికి అస‌లు కార‌ణమిదే

Update: 2020-05-29 05:15 GMT
భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు రావ‌డం స‌హ‌జం. ఈగోల స్థాయిలు.. అర్థం చేసుకుని స‌ర్ధుకుపోవ‌డాన్ని బ‌ట్టి కాపురాలు నిర్వ‌చించ‌బ‌డ‌తాయి. అయితే దాదాపు 20 ఏళ్ల వైవాహిక జీవితం అనంత‌రం 17 ఏళ్ల వ‌య‌సు ఉన్న కుమారుడిని క‌లిగి ఉండి ఆ జంట విడిపోవ‌డం ఇటీవ‌ల సంచ‌ల‌న‌మైంది. ప్ర‌స్తుతం వార‌సుడి భ‌విష్య‌త్ ఆ ఇద్ద‌రి బాధ్య‌త‌. ఇంత‌కీ ఇదంతా ఎవ‌రి గురించో వేరే చెప్పాలా?  ది గ్రేట్ మ‌లైకా అరోరా- ఆర్భాజ్ ఖాన్ జోడీ గురించే.

నిజానికి ఆ ఇద్ద‌రూ విడాకులు తీసుకోవ‌‌డానికి ముందే ఎవ‌రి దారిలో వారు ఉన్నారు. ఆర్భాజ్ ఖాన్ విదేశీ మోడ‌ల్ ఆండ్రియానీ జార్జియాతో స‌హ‌జీవ‌నం ప్రారంభించాడు. అప్ప‌టికే మ‌లైకా యువహీరో అర్జున్ క‌పూర్ తో ఎఫైర్ సాగించ‌డం బ‌య‌ట‌ప‌డింది. అయితే ఇవేవీ ఈ జంట విడిపోవ‌డానికి కార‌ణాలు కావ‌ట‌.

ర‌క‌ర‌కాల సంద‌ర్బాల్లో ఆ ఇద్ద‌రూ చెప్పిన విష‌యాల్ని ప‌రిశీలిస్తే... ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్వేచ్ఛా స్వాతంత్య్రాల‌కు సంబంధించిన ఈగోలే క‌నిపిస్తున్నాయి. ``క‌లిసే ఉండాల‌నుకున్నా.. అంతా బావుంది అనుకుంటుండ‌గానే చేజారింది ప‌రిస్థితి`` అంటూ ఆర్భాజ్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. ఇక మ‌లైకా నుంచి విడిపోవ‌డానికి అర్జున్ కార‌ణ‌మా? అంటూ ఆర్బాజ్ ని మీడియా ప్ర‌శ్నిస్తే.. ఈ ప్ర‌శ్న అడ‌గ‌డం కోసం రెండ్రోజులుగా ప్రిపేర‌య్యావు క‌దా?  నాక్కూడా అంత స‌మ‌యం కావాలి! అంటూ సైడ‌యిపోయాడు ఆర్భాజ్. ఆ ప్ర‌శ్న వేధించినా అంత‌కుమించిన కార‌ణాలు త‌న విడాకుల వెన‌క ఉన్నాయ‌ని ఆర్భాజ్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక మ‌లైకా నుంచి విడిపోయినంత మాత్రాన వివాహ‌వ్య‌వ‌స్థ‌ను ఆర్భాజ్ త‌ప్పుప‌ట్ట‌లేదు. అలాగే త‌న నుంచి స్నేహ పూర్వ‌కంగానే విడిపోయాడు. ఇప్ప‌టికీ ఇద్ద‌రూ స్నేహితులుగానే ఉండ‌డం ఆస‌క్తిక‌రం.

ఇక మ‌లైకా సుదీర్ఘంగా రాసుకొచ్చిన ఓ లేఖ సారాంశం.. స్త్రీ స్వేచ్ఛను.. స్త్రీ సంతోషాన్ని.. ఎదుగుద‌ల‌ను ప్ర‌తిఫ‌లించింది. త‌న స్వేచ్ఛా జీవితానికి ఎవ‌రూ అడ్డుప‌డ‌కూడ‌ద‌నే అర్థం అందులో ప్ర‌తిధ్వ‌నించింది. ``డోంట్ నీడ్ వ్యాలిడేష‌న్.. `` `లీవ్ ది పాస్ట్ బిహైండ్`.. `స్టాప్ ప్లేయింగ్ విక్టిమ్స్`.. అంటూ మ‌లైకా త‌న మాట‌ను సూటిగానే వినిపించింది. త‌మ గ‌తంపై వేరే ఎవ‌రూ జాలి ద‌య చూపించ‌డం అన్న‌ది ఆ ఇద్ద‌రికీ న‌చ్చ‌దు. తెలిసే చేశాం. క‌లిసే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. స్నేహంగానే విడిపోయామ‌ని తెలిపారు ఆ ఇద్ద‌రూ. ప్ర‌స్తుతం వార‌సుడు ఆర్య‌న్ బాధ్య‌త‌ల్ని ఆ ఇద్ద‌రూ తీసుకుని ఎవ‌రికి వారు సంతోషంగానే ఉన్నారు.
Tags:    

Similar News