సంక్రాంతి సినిమాలకు అసలైన పరీక్ష

Update: 2023-01-18 08:30 GMT
తెలుగు సినిమాకు సంక్రాంతి పండుగ అనేది అతిపెద్ద మార్కెట్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి నాలుగు అతిపెద్ద చిత్రాలు బరిలో దిగాయి. 12వ తేదీన గోపీచంద్ మలినేని టేకింగ్, తమన్ మ్యూజిక్, బాలయ్య బాబు యాక్టింగ్ చూసి ప్రేక్షకులు థియేటర్లలో మాస్ జాతర జరిపారు.

ఇక 13వ తేదీన చిరంజీవి వాల్తేరు వీరయ్య తన అభిమానులకు పూనకాలు రప్పించాడు. మాస్ యాక్షన్, పవర్ ఫుల్ పర్ఫామెన్స్ తో పిచ్చెక్కించాడు. ఇక 11వ తేదీన విడుదలైన అజిత్ తెగింపు కూడా బ్యాంక్ దోపిడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చి ఫ్యాన్స్ ను థ్రిల్లింగ్ కు గురిచేసింది. జనవరి 14న థియేటర్లోకి వచ్చిన వారసుడు తన ఫ్యామిలీ సంరక్షణ కోసం గొప్పింటి కుర్రాడు ఎలాంటి బాధ్యత తీసుకున్నాడో చూపించి అభిమానులను అలరించాడు.

గత వారం విడుదల అయిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరీ వీరయ్య, బాలకృష్ణ వీరసింహా రెడ్డి, విజయ్ వారసుడు, అజిత్ తెగింపు చిత్రాలు ప్రారంభంలో భారీగానే కలెక్షన్స్ ను రాబట్టాయి. అయితే సంక్రాంతి పండుగ ముగియడంతో ఈ చిత్రాలకు నిజమైన పరీక్ష ఈరోజే మొదలవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నాలుగు చిత్రాలు మొదట్లో భారీగానే కలెక్షన్లు రాబట్టినప్పటికీ.. కొన్ని పెద్ద సినిమాలు మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే గత వారం కల్యాణం కమనీయం సినిమా కూడా విడదలైంది. అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా పూర్తిగా విఫలమైంది.

విడుదలైన నాలుగు భారీ చిత్రాల్లో రెండు సినిమాలు తెలుగువే కావడంతో.. తెలుగు ప్రేక్షకులు ఎక్కువ వాటిపైనే దృష్టి పెట్టారు. వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలను చూసేందుకు ఎక్కువ ఇష్టపడుతున్న తెలుస్తోంది. వారసుడు, తెగింపు చిత్రాలను ఎక్కువగా చూడడం లేదనే టాక్ వినిపిస్తోంది.

మరి నింజంగానే ఈ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఇష్టపడట్లేదా.. పండుగ కాబట్టి తెలుగు హీరోల సినిమాలు చూశారా అనేది ఈరోజు తేలనుంది. కాబట్టి బాక్సీఫీస్ వద్ద సంక్రాంతి బరిలో ఏ సినిమా బిగ్గీ అనేది ఈరోజు ఖరారు కాబోతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News