రాజమౌళి ఫ్యామిలీ నుండి వెళ్లి సుకుమార్ దగ్గర శిష్యరికం చేసాడు సింహ.. కీరవాణి తనయుడిగా కాకుండా ఓ సాధారణ వ్యక్తిలా అప్రోచ్ అయిన విధానం బాగా నచ్చిందని ఓ సందర్భంలో సుకుమార్ కూడా చెప్పాడు. అయితే రాజమౌళి ని కాదని సింహ సుక్కు దగ్గరికి వెళ్ళడానికి ఓ రీజన్ ఉందట. లేటెస్ట్ గా ఈ 'మత్తు వదలరా' ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన సింహ ఆ విషయన్ని బయట పెట్టాడు.
హీరోగా సినిమా చేసే ముందు సినిమా గురించి మేకింగ్ గురించి పూర్తిగా తెలుసుకో ఆ తర్వాత ప్రయత్నించమని కీరవాణి సతీమణి కొడుక్కి సలహా ఇచ్చారట. ఇక బాబాయ్ దగ్గరైతే స్పెషల్ ట్రీట్ మెంట్ ఉంటుందని అక్కడ పని నేర్చుకోలేనని గ్రహించి బాబాయ్ తర్వాత తనకు ఫేవరేట్ డైరెక్టర్ అయిన సుకుమార్ దగ్గరికి ఆయన అసిస్టెంట్ సహాయంతో చేరాడట. ఆ తర్వాత ఓ సందర్భం చూసి తను కీరవాణి కొడుకునని చెప్పాడట.
అయితే సుకుమార్ దగ్గర బెటర్ మెంట్ ఎలా చేయొచ్చు, క్వాలిటీ మేకింగ్ ఇలా కొన్ని అంశాలు నేర్చుకున్నాడట. ఇక ఈ నెల 25 న తన మొదటి సినిమా రిలీజవుతుందన్న ఆనందంతో పాటు రిజల్ట్ ఎలా ఉంటుందనే టెన్షన్ కూడా ఉందని తెలిపాడు. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ కి ముందు రోజు ఓ స్పెషల్ షో వేస్తున్నారు. రాజమౌళి ఫ్యామిలీ తో సెలెబ్రిటీస్ , అలాగే మీడియాను ఇన్వైట్ చేస్తున్నారు.