యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ `RRR`. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిస్థాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 భాషల్లో విడుదల కాబోతోంది. భారత స్వాతంత్య్రానికి పూర్వం కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఫాంటసీ అంశాలని జోడించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని గోండు బెబ్బులి గానూ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజు పాత్రల్లో చూపించారు.
దీంతో ఈ ఇద్దరు కలవడం ఏంటీ? వీరు కలిసి ఏం చేశారు? .. ఎలా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా ఆసక్తి ఏర్పడింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేసింది. ఇండియన్ స్క్రీన్ పై హాలీవుడ్ సినిమా అనే స్థాయిలో `RRR` వుందని అన్ని భాషలకు చెందిన స్టార్స్ , మేకర్స్, ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమా రిలీజ్ పై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ `RRR` రిలీజ్ పరిస్థితి ఏంటనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ట్రేడ్ నిపుణులు చెబుతున్న లెక్కలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాకు రాజమౌళి చేసిన ప్రచారం భారీ గా ప్లాస్ కాబోతోందని , భారీ స్థాయిలో వసూళ్లని ఈ సినిమా రాబట్టబోతోందని చెబుతున్నారు.
ఒమిక్రాన్ వేళ కంట్రీ వైడ్ లాక్ డౌన్ విధిస్తే తప్ప `RRR` రిలీజ్ ని ఆపలేరని, హిందీలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మొదటి రోజే దాదాపు 30 కోట్ల కలెక్షన్ లు రాబట్టే అవకాశం వుందని, ఇది ఖచ్చితంగా జరుగుతుందని, బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో `RRR` మేకర్స్ తో పాటు అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న `RRR` ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఒమిక్రాన్ దెబ్బకొట్టకపోతే `RRR` ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ఫిగర్లని నమోదు చేయడం తో పాటు ప్రపంచ సినిమాకి ఇండియన్ సినిమా సత్తాని చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఒమిక్రాన్ ప్రబలితే మాత్రం దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు `RRR`కు షాపంగా మారడం ఖాయం అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ దాని ప్రభావం లేకపోతే మాత్రం హిందీ వెర్షన్ తొలి రోజు 30 కోట్ల వరకు ఓపెనింగ్స్ ని రాబట్టే అవకాశం వుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.