తమిళ స్టార్ హీరో ధనుష్ చాలా సంవత్సరాల తర్వాత సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో చేసిన సినిమా నేనే వరువేన్. ఈ సినిమాను తెలుగు లో గీతా ఆర్ట్స్ వారు నేనే వస్తున్న టైటిల్ తో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. తెలుగు లో ఈ సినిమాకు గీతా ఆర్ట్స్ వారు తీసుకోవడంతో మంచి క్రేజ్ దక్కింది.
ఈ నెల చివరి వారంలో సినిమాను విడుదల చేస్తాం అంటూ తేదీ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మొన్నటి వరకు సెప్టెంబర్ 30వ తారీకున సినిమా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కానీ అదే రోజున మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. అందుకే ఒక రోజు అటు లేదా ఇటు అన్నట్లుగా విడుదల ఉండే అవకాశం ఉంది.
తమిళ మీడియా నుండి వస్తున్న వార్తల ప్రకారం సినిమాను సెప్టెంబర్ 29వ తారీకున విడుదల చేసే అవకాశం ఉందట. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు ముగించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికెట్ దక్కిందట.
ఇక ఈ సినిమా రన్ టైమ్ గురించి ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా ను 2 గంటల 15 నిమిషాలు గా ఉండబోతున్నట్లుగా అధికారికంగా క్లారిటీ వచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ లో సినిమా యొక్క రన్ టైమ్ చూసి చాలా మంది సర్ ప్రైజ్ అవుతున్నారట.
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల దాదాపు అన్ని సినిమాలు కూడా రెండున్నర గంటలకు ఎక్కువగానే ఉంటున్నాయి. కనుక ఈ సినిమా రన్ టైమ్ కూడా అలాగే ఉంటుందని భావించగా కేవలం 2 గంటల 15 నిమిషాలు మాత్రమే ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో ధనుష్ పలు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.