‘సారంగ దరియా’ నాదే.. మంగ్లీ గొంతు బాగలేదుః కోమలి.. కాదు అందరిదీః సుద్దాల.. ఏం జరగనుంది?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’. నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ‘సారంగ దరియా’ అనే పాటను ఈ మధ్యనే రిలీజ్ చేసింది యూనిట్. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే.. ఆ వెంటనే వివాదం కూడా వచ్చేసింది.
ఈ పాట నాదేనంటూ కోమలి అనే సింగర్ తెరపైకి వచ్చింది. గతంలో ఓ టీవీ ఛానల్ లో నిర్వహించిన ‘రేలారే రేలా’ అనే ప్రోగ్రామ్ లో కోమలి ఈ పాట పాడింది. అయితే.. ఈ పాటను తాను సేకరించానని, అలాంటిది కనీసం తనకు క్రెడిట్ ఇవ్వకుండా వాడుకున్నారని అంటోంది కోమలి.
సారంగ దరియా పాటకు సంబంధించిన ప్రోమో వచ్చిన తర్వాత.. తనను పాడతావా అని శేఖర్ కమ్ముల, సుద్దాల అశోక్ తేజ ఫోన్ చేసి అడిగారంటూ చెప్పింది కోమలి. కానీ.. అప్పుడు గొంతు బాగాలేదని, ఓ పది రోజులు టైం అడిగానని చెప్పింది. అయితే.. ఇప్పటికే టైం దగ్గర పడిందని, ఆడియో ఫంక్షన్లో పాడిస్తామని, నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తామని శేఖర్ కమ్ముల హామీ ఇచ్చారని తెలిపింది. కానీ.. ఈ పాటకు సంబంధించి ఎక్కడ కూడా తనకు క్రెడిట్ ఇవ్వకపోవడం సరికాదని అంటోంది కోమలి.
అయితే.. ఈ విషయంపై స్పందించిన సుద్దాల అశోక్ తేజ.. జానపదం అందరిదని అన్నారు. ఎవరైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉందన్నారు. ఈ మాటలపై మళ్లీ స్పందించిన కోమలి.. ‘‘అది నిజమే అయినప్పటికీ.. మొదటిసారిగా ఈ పాటను కూర్చి పాడింది నేనే. కాబట్టి అది నాదే’’ అంటోంది.
అంతేకాదు.. సింగర్ మంగ్లీపైనా కామెంట్ చేసింది కోమలి. మంగ్లీ గొంతులో ఫోక్ సరిగా ధ్వనించలేదని, ఆమె పాడిన పాట బాగలేదని చెప్పుకొచ్చింది. జనాలు కూడా అదే అంటున్నారని, కోమలినే ఆ పాట పాడాలని కోరుకుంటున్నారని చెప్పింది. క్రెడిట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా.. ఆ పాట తనదేనని అంటోంది. ఈ విధంగా.. సారంగ దరియా పాట వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి, దీనికి ఎప్పుడు, ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి.