ప్రారంభమైన సర్కారు వారి సెకండ్ షెడ్యూల్..!

Update: 2021-04-13 08:54 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఇదివరకే మొదటి షెడ్యూల్ దుబాయ్ లో పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఆలస్యంగా ప్రారంభమైంది. తాజాగా సర్కారు వారి సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో సూపర్ స్టార్ మహేష్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనబోతుంది. సినిమాలోని ఇంపార్టెంట్ సన్నివేశాలను ఈ షెడ్యూల్లో షూట్ చేయనున్నట్లు సమాచారం. డైరెక్టర్ పరశురామ్ తో పాటు మహేష్ బాబు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ సర్కారు షూటింగ్ లో పాల్గొన్నారు. దుబాయ్ షెడ్యూల్ తర్వాత ఈ సినిమా ప్రారంభం అవ్వడానికి నెలల్లో గ్యాప్ వచ్చింది. ఈ సినిమా మహేష్ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కుతోంది.

అయితే ఏప్రిల్ ఎండింగ్ వరకు సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో సాగనుంది. అనంతరం సర్కారు టీమ్ భారీ షెడ్యూల్ కోసం యూరప్ బయలుదేరనుంది. ఈ సినిమా భారీ బ్యాంకు కుంభకోణం నేపథ్యం చుట్టూ తిరుగుతుందని టాక్. అయితే సర్కారు మూవీకి ప్రస్తుతం బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న తమన్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ - తమన్ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమా ఇది. అయితే ఈ సినిమాను మైత్రి మూవీస్, 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ లతో పాటు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో మాంచి మసాలా సాంగ్ ఒకటి ఉంటుందని తమన్ చెప్పి సినిమా పై అంచనాలు పెంచాడు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.
Tags:    

Similar News