షూటింగుల బంద్ విర‌మ‌ణ‌ డేట్ ఫిక్స్

Update: 2022-08-16 15:11 GMT
తెలుగు చలనచిత్ర పరిశ్రమ బంద్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైన‌ సంగ‌తి తెలిసిందే. ప‌దిహేను రోజులుగా షూటింగుల బంద్ నిరాఘంటంగా కొన‌సాగుతోంది. ఈసారి బంద్ కి నిర్మాత‌లే పిలుపునివ్వ‌డంతో స‌న్నివేశం సీరియ‌స్ గా మారింది. కార్మికులు ఉపాధి లేక బెంబేలుగా ఉన్నారు.

అయితే ఈసారి బంద్ తో చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కృతం కావాల‌ని అంతా భావిస్తున్నారు. కానీ ప‌రిశ్ర‌మ‌ స‌మ‌స్య‌ల‌కు చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కారం ల‌భించిన‌ట్టేనా?  తిరిగి షూటింగులు ప్రారంభించేది ఎప్పుడు? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది.

ఇటీవ‌లి బిగ్ డిబేట్ లో OTT రిలీజ్ డేట్ అగ్రిమెంట్స్ తో పాటు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల VPF రేట్లు.. టిక్కెట్ ధరలు .. ప్రొడక్షన్ ఖర్చులు వంటి అనేక విషయాల గురించి స‌మావేశాల్లో చ‌ర్చించారు. ఈ ప‌దిహేను రోజుల్లో ర‌క‌ర‌కాల అంశాల‌పై నిర్మాత‌లు చ‌ర్చించారు. అయితే చ‌ర్చ‌ల్లో ఏం తేల్చారు? అన్న‌దానికి ఇంకా క్లారిటీ రాలేదు.

ఇంత‌లోనే ఆగస్టు 22 నుండి షూటింగ్ లు తిరిగి ప్రారంభమవుతాయని సమాచారం అందింది. నందమూరి బాలకృష్ణ  #NBK107.. మహేష్-త్రివిక్రమ్ చిత్రం.. అలాగే పవన్ `వినోదయ సీతమ్` రీమేక్ వంటివి  ప్రారంభోత్స‌వాల‌కు సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో రవితేజ .. నాని వంటి ఇతర హీరోలు కూడా త‌మ పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం అందింది.

నిర్మాత‌ల గిల్డ్.. నిర్మాత‌ల మండ‌లితో పాటు ఛాంబ‌ర్ వ‌ర్గాలు త్వ‌ర‌లోనే అధికారికంగా మీడియాకి బంద్ విర‌మ‌ణ గురించి ప్ర‌క‌టించే ఛాన్సుంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఆ తేదీ ఎప్పుడు? అన్న‌ది ఇంకా రివీల్ కాలేదు.

మీడియా స‌మావేశంలో తాము ఏఏ అంశాల‌పై చ‌ర్చించారో కూడా నిర్మాత‌లు సినీపెద్ద‌లు వెల్ల‌డించ‌నున్నారు. ఈ స‌మావేశాల్లో కార్మికుల బాగోగుల గురించి కూడా చ‌ర్చ సాగిందా లేదా? అన్న‌ది ఇప్పటికి స‌స్పెన్స్ ఎలిమెంట్!!
Tags:    

Similar News