శ్రీవల్లి స్టెప్‌ ఇప్పుడు ఇలా కూడా వాడేస్తున్నారు

Update: 2022-01-23 09:30 GMT
అల్లు అర్జున్‌.. సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషన్ క్రియేట్‌ చేసింది. వసూళ్ల విషయంలో 2021 లో విడుదల అయిన ఇండియన్ సినిమాల్లో నెం.1 గా నిలిచింది. కేవలం కలెక్షన్స్‌ మాత్రమే కాకుండా భారీ ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్‌ కూడా అవుతుంది.

ఈ సినిమాలోని ప్రతి పాట కూడా నెట్టింట ఏదో ఒక రకంగా హల్‌ చల్‌ చేస్తూనే ఉంది. ముఖ్యంగా షార్ట్‌ వీడియోల కోసం పుష్ప పాటలు మారు మ్రోగుతున్నాయి. క్రికెటర్స్ మొదలుకుని సినిమా స్టార్స్ వరకు ఎంతో మంది బన్నీ వేసిన శ్రీవల్లి చెప్పు వదిలే స్టెప్పు వేశారు. కొన్ని లక్షల మంది ఆ స్టెప్పును ట్రై చేశారు. చెప్పు వదిలేసి చేసే ఆ స్టెప్ప్‌ చాలా మందికి నచ్చింది. చాలా విభిన్నంగా అనిపించిన ఆ స్టెప్‌ నెలలు గడుస్తున్నా కూడా ట్రెండ్‌ అవుతూనే ఉంది.

తాజాగా ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. పుష్ప శ్రీవల్లి పాట కు ఒక చిన్నారిని ఎత్తుకుని వేసిన స్టెప్‌ కు పిదా అవుతున్నారు. పాప ఏడ్చిన సమయంలో శ్రీవల్లి స్టెప్‌ వేస్తే ఊరుకుంటుంది అంటూ ఒక నార్త్‌ ఇండియన్ వేసిన స్టెప్‌ వైరల్‌ అయ్యింది. శ్రీవల్లి పాట కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా మొత్తం అన్ని భాషల్లో కూడా ఇంకా ట్రెండ్‌ అవుతూనే ఉంది.

 సోషల్ మీడియాలో ఈ పాట స్టెప్పులు లక్షల కొద్ది వస్తూనే ఉన్నాయి. తాజాగా టీం ఇండియా స్టార్ క్రికెటర్ కూడా శ్రీవల్లి స్టెప్‌ వేశాడు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం మారు మ్రోగిపోవడం తో పాటు దేశ వ్యాప్తంగా ఆయన పాటలు ఒక రేంజ్ లో ఊపేస్తున్నాయి. అన్ని భాషలకు తగ్గట్లుగా సింగర్స్ తో పాడించడం లో దేవి శ్రీ ప్రసాద్‌ సక్సెస్ అయ్యాడు. అందుకే ఈ పాట ఇంతటి విజయాన్ని సొంతం చేసుకుంది అనడంలో సందేహం లేదు.

పుష్ప సినిమా లో అల్లు అర్జున్‌ కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఐటెం సాంగ్‌ ను సమంత చేయగా ఆ పాట ఏ స్థాయి లో సక్సెస్ అయ్యిందో తెల్సిందే. సుకుమార్‌ పుష్ప పార్ట్‌ 1 తో ఏకంగా 300 కోట్ల కు పైగా వసూళ్లను దక్కించుకుని రెండవ పార్ట్‌ పై అంచనాలు భారీగా పెంచేశాడు.

 రికార్డు బ్రేకింగ్ వసూళ్లు దక్కించుకుని నాన్ బాహుబలి రికార్డును దక్కించుకున్న పుష్ప పార్ట్‌ 1 కి ఇప్పటికే పార్ట్‌ 2 వర్క్ షురూ అయ్యింది. వచ్చే నెలలో చిత్రీకరణ పనులు మొదలు పెట్టాల్సి ఉంది. కాని కరోనా థర్డ్‌ వేవ్‌ వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యేలా ఉంది. పుష్ప సోషల్‌ మీడియా సెన్షేషన్‌ మరో రెండు మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పుష్ప సినిమాలోని పాటలు అన్ని కలిసి బిలియన్ వ్యూస్ ను కేవలం యూట్యూబ్‌ లోనే దక్కించుకున్నాయి.





Tags:    

Similar News